బాలయ్యా...! అంతకోపమైతే ఎలా..??? అసిస్టెంట్‌ని కొట్టాడు
మళ్ళీ ఒకసారి మన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు.
టాలీవుడ్ హీరోల్లో బాలయ్య బాబు తరహానే వేరు సినిమాల్లో ఎంత రౌద్రాన్ని ప్రదర్షిస్తారో బయట మాత్రం చాలా ఫ్రెంద్లీగా ఉందాడు అంటూ చెప్తూంటారు ఆయన తో పని చేసిన వాళ్ళంతా. కానీ బయట కనిపించే వ్యవహారం మాత్రం వేరుగా ఉంటుంది. సీసీఎల్ లో జనం మధ్యే సిగరెట్ తాగినా.., "కొట్టానంటే అయిపోయావే.. అంటూ ఫొటో దిగటానికి వచ్చిన అభిమానిని బెదిరించినా బాలయ్య స్టైలేవేరు.
మామూలుగా బాగా సహనం తోనే ఉండే బాలకృష్ణ కొన్ని సార్లు మాత్రం ఆ సహనాన్ని కోల్పోతారు. వర్క్ టెన్షన్ కావచ్చు, రాజకీయ జీవితం లో ఉండే ఒత్తిళ్ళు కావచ్చు.. కారణం ఏదైనా అప్పటి వరకూ నవ్వుతూనే ఉన్నా వెంటనే సీరియస్ అయిపోతడు. కాస్త చికాకు వస్తే "ఏంటీ గోల మమ్మల్ని **గెయ్ మంటారా?" అనేస్తాడు. వెన్నలాంటి బాలయ్య మనసు ఆసమయం లో మాత్రం కొంచం కఠినంగా అనిపిస్తుంది.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి సహనం కోల్పోయారు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ కెమెరాల కంటపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమంలో షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. బాలకృష్ణ దర్శకుడు కేయస్ రవికుమార్ తో మాట్లాడుతుండగా అసిస్టెంట్ షూ విప్పటం వీడియోల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే బాలయ్య కావాలని కోపంతో చేసినట్టు కాక సరదాగానే చేసినట్టు కనిపిస్తుందీ దీనికింత రాద్దాంతమా అంటూన్నారు అభిమానులు...


Click it and Unblock the Notifications











