భీష్మగా బాలయ్య
బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో రానున్న చిత్రానికి భీష్మ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. రైడ్ చిత్రంతో నిలదొక్కుకున్న రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తాడని తెలుస్తోంది. రమేష్ వర్మ చెప్పిన స్టోరీ లైన్ బాలకృష్ణకు బాగా నచ్చటంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాతో రమేష్ వర్మ పెద్ద డైరక్టర్ల జాబితాలో చేరుతాడని ఫిల్మ్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు. పోస్టర్స్ డిజైనర్ గా పాపులర్ అయిన రమేష్ వర్మ ఒక ఊరిలో సినిమాతో డైరక్టర్ గా తెరంగ్రేటం చేసాడు.
అనంతరం సముద్ర దర్శకత్వంలో వచ్చిన మల్లెపూవు చిత్రానికి కథ అందించాడు. ఇప్పుడు రైడ్ చిత్రంతో పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు. గతంలో బెల్లంకొండ..బాలకృష్ణ కాంబినేషన్లో లక్ష్మీ నరసింహ వంటి హిట్స్ వచ్చాయి. ఐదేళ్ళ క్రిందట జరిగిన కాల్పుల ఉదంతం తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. మొన్న రైడ్ ఆడియో పంక్షన్ కి బాలయ్య వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం బాలయ్య పుట్టిన రోజుని బెల్లంకొండ గ్రాండ్ గా జరిపి అందరినీ ఆనందపరిచాడు. ఇప్పడు మళ్ళీ భీష్మతో అభిమానులను అలరిస్తాడని అంటున్నారు. బెస్టాప్ లక్ రమేష్ వర్మ.


Click it and Unblock the Notifications











