ఏకమైన బాలయ్య, బెల్లంకొండ

బెల్లంకొండ సురేష్ లివర్ లో బాలకృష్ణ కాల్చిన బుల్లెట్లు ఇంకా ఉన్నాయి. ఆ నొప్పులు అలా ఉండగానే బాలకృష్ణ, బెల్లంకొండ మంచి మిత్రులుగా స్టేజి మీద కన్పించడం ఆశ్చర్యం కలిగించింది. బాలకృష్ణ తనను కాల్చలేదని కోర్టులో చెప్పినందుకు గాను బాలయ్య అతనికి కాల్షీట్లు ఇచ్చినట్టు అప్పట్లో విన్పించింది. అది నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని నిన్నటి సంఘటన నిరూపిస్తోంది. బెల్లంకొండ గట్స్ ఉన్న నిర్మాత అని బాలకృష్ణ ప్రశంసించారు. బాలయ్య బాబు దేవుడితో సమానమని, తాను ఆయనకు వీరాభిమానినని బెల్లంకొండ అన్నారు. బాలకృష్ణ పాట "దంచవే మేనత్త కూతురా" పాటను బెల్లంకొండ తన "రైడ్" సినిమాలో రీమిక్స్ చేశారు. "కాలం మారుతుంది-చేసిన గాయాలు మాన్పుతుంది" అన్న సినిమా పాట గుర్తుకొస్తోందా ఈ ఇద్దరు మిత్రుల బంధాన్ని చూస్తుంటే....
balakrishna bellamkonda suresh ride chennakesava reddy lakshminarasimha బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ రైడ్


Click it and Unblock the Notifications