50 years Balakrishna: బాలయ్య ఫాంటసీ మూవీ రీరిలీజ్... ఆ రోజు బాక్సులు బద్దలవ్వాల్సిందే!

బాలకృష్ కెరీర్‌ లోనే మైలురాయిగా నిలిచిన చిత్రం 'భైరవద్వీపం'. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ జానపద చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. రోజా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. రంభ స్పెషల్‌ క్యారెక్టర్‌లో మెరిశారు. బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా 'భైరవద్వీపం' సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా 4కె ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే...

సినిమా ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన హిట్ సినిమాలను.. అభిమానుల కోసం ఇప్పుడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక హీరోల పుట్టినరోజులు, స్పెషల్ అకేషన్స్ కు ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో ఈ రిలీజ్ రిలీజ్ ట్రెండ్ పోకిరి సినిమా నుంచి ప్రారంభం అయింది. ఇక అప్పటి నుంచి ప్రతి హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

Balakrishna Bhairavadweepam Rerelease 4k trailer Released and this movie theaters on August 30th

ఇప్పుడు బాలయ్య సినిమాల వంతు వచ్చేసింది. బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే ఛాన్స్ వచ్చింది. బాక్స్ లు బద్దలయ్యే టైం వచ్చేసింది. ఒకప్పుటి బాలయ్య బాబు ఫాంటసీ చిత్రం ఇప్పుడు మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పుడంటే... టెక్నాలజీ, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వచ్చాయి. పురాణాలు, పీరియాడిక్ సినిమాల్లో ఎఫెక్ట్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. కానీ ఇవేమి లేనప్పుడు కూడా గ్రాఫిక్స్ తో అదరగొట్టిన సినిమా భైరవద్వీపం.

నందమూరి బాలయ్య కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కు సిద్దమైంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకటరామిరెడ్డి నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించింది. ఇక అందాల తార రంభ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. 1994లో రిలీజ్ అయిన భైరవ ద్వీపం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Balakrishna Bhairavadweepam Rerelease 4k trailer Released and this movie theaters on August 30th

ఇప్పటికీ బైరవద్వీపం మూవీ సాంగ్స్ కూడా ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. ఇక ముఖ్యంగా బాలకృష్ణ, రోజా కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక నరుడా ఓ నరుడా అంటూ రంభ డ్యాన్స్ ను ఇప్పటికీ మర్చిపోవడం కష్టమే. ఇన్ని హైలైట్స్ ఉన్న ఈ సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా భైరవద్వీపం 4k ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఆగస్టు 30 బైరవ ద్వీపం సందడి చేయనుంది. బాలయ్య ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి న్యూస్. ఇప్పటి వరకు అన్ని హీరోల సినిమాలు రీ రిలీజ్ కాగా.. బాలయ్య సినిమా రీ రిలీజ్ ఈనెలఖరులో కానుంది. ఇక ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 19వ తేదీన దసరా కానుకగా రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X