Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్... సినిమా విడుదల వాయిదా వేసిన మేకర్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భైరవ ద్వీపం సినిమా రిలీజ్ అయిన కొత్తలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో రీరిలీజ్ సినిమాలు ట్రెండ్ సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ భైరవ ద్వీపం సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు చివరిలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ ఈరోజు కావడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే...

సుమారు 29 ఏళ్ల కిందట రిలీజై సంచలన విజయం సాధించిన భైరవ ద్వీపం సినిమాను మళ్లీ 4కే క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు నిర్ణయం తీసుకున్నారు. రీ రిలీజ్ చేయాలని ఎప్పుడో నిర్ణయం జరిగిపోయినా ఆగస్టు 30న రీరిలీజ్ అని అనౌన్స్ చేశారు.

Balakrishna

కానీ ఈరోజు ఈ సినిమాని రీ రిలీజ్ చేయడం లేదు. దానికి ముఖ్యమైన కారణం కొన్ని టెక్నికల్ ఇబ్బందులేనని తెలుస్తోంది. సినిమా రిలీజ్ వాయిదా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ. అయితే మరోపక్క ఆశించిన మేర అడ్వాన్స్ బుకింగ్స్ రాకపోవడంతో ఈ రీ రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది.

సింగీతం శ్రీనివాస రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రోజా, బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా నటించింది. క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి, దేవ్ వర్మ ఈ భైరవ ద్వీపం మూవీని రీ రిలీజ్ చేయాలని భావించి ముందు ఈ మూవీని నవంబర్ లో రీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆగస్ట్ 5వ తేదీనే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని భావించినా.. అప్పుడూ బుకింగ్స్ లేకపోవడంతో ఆగస్ట్ 30కి వాయిదా వేసినట్టు ప్రచారం జరగ్గా ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొందని అందుకే రీ రిలీజ్ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ భైరవ ద్వీపం చిత్రం 4కేను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి అనుభూతిని పంచేందుకు ఈరోజు థియేటర్లలోకి తీసుకురావడానికి మేం అన్ని ప్రయత్నాలు చేశాము కానీ... దురదృష్టవశాత్తు మేము కొన్ని సాంకేతిక లోపాల కారణంగా మళ్లీ విడుదలను వాయిదా వేయవలసి వచ్చింది... తదుపరి విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

మరోవైపు బాలయ్య బాబు నటిస్తున్న భగవంత్ కేసరి మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల నందమూరి బాలకృష్ణ కుమార్తె పాత్రలో కనిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఈమధ్య కాలంలో నందమూరి మోక్షజ్ఞ తేజ ఈ సినిమా సెట్స్ కి వెళ్లినప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X