twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య ‘భట్టి విక్రమార్క’ రీమేక్ ఫస్ట్ లుక్

    By Bojja Kumar
    |

    అప్పట్లో వచ్చిన ఎన్టీ రామారావు నటించిన 'భట్టి విక్రమార్క' సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కింగ్ విక్రమార్క పాత్రలో, కాంతారావు బట్టి పాత్రలో, ఎస్వీ రంగారావు మాంత్రికుడి పాత్రలో, అంజలి దేవి ప్రభావతిదేవి పాత్రలో నటించారు. తాజాగా ఈచిత్రానికి రీమేక్ రూపొందనుంది. నందమూరి బాలకృష్ణ నటించనున్న ఈచిత్రాన్ని శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మించనున్నారు.

    జూన్ 10న బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని యలమంచిలి సాయిబాబు ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

    అనగనగా ఒక ధీరుడు చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాశ్ ఈ రీమేక్ చిత్రం ద్వారా బాలకృష్ణను డైరక్ట్ చేసే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. తొలి సినిమా ఫెయిల్యూర్ అయినా గ్రాఫిక్స్ లోనూ, హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాల్లోనూ ప్రకాష్ తన ప్రతిభను చూపించాడని, జానపద కథను బాగా తీసాడని అప్పట్లో వినిపించింది. అందుకే భట్టి విక్రమార్క చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఈ జనరేషన్ పిల్లలకు భట్టి విక్రమార్క సినిమాలోని పాత్రలను, ఆ కథను పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో యలమంచిలి సాయిబాబు ఈ నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన తండ్రి నటించిన లవకుశ చిత్రాన్ని శ్రీరామరాజ్యం టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బాపు దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం ఆర్దికంగా పెద్ద గిట్టుబాటు కాకపోయినా మంచి పేరు ని తెచ్చిపెట్టింది. దాంతో అదే ఉత్సాహంతో అదే నిర్మాతతో బాలకృష్ణ మరో చిత్రం చేయటానికి కమిటయ్యారు.

    English summary
    Balakrishna is going to act in Bhatti Vikramarka Remake soon. Yalamanchili Saibabu who earlier produced 'Sri Ramarajyam' with Balakrishna is set to produce Bhatti Vikramarka remake on Sri Saibaba Movies banner. The first look poster of Balakrishna in the movie unveiled on the occasion of his 52nd birthday is amazing and have resembles of his father Late NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X