మొత్తానికి బాలకృష్ణకు భూమిక దొరికిపోయింది
భూమిక పూర్తి ఖాళీ పడిపోయింది. దొరికిన అవకాశమే చాల గొప్పదన్న పొజీషన్ లో ఉంది. అయితే తాజాగా ఆమెకు బాలకృష్ణ నుంచి పిలుపు వచ్చింది. బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న పరుచూరి మురళి చిత్రం కోసం ఆమెను హీరోయిన్ గా అడిగి కమిట్ చేయించుకున్నారు. ఓ ప్రక్క బాలకృష్ణకు ఇద్దరు, ముగ్గరు హీరోయిన్స్ కావాల్సి రావటంతో ఫేడవుట్ అయిన వారిని, ఖాళీగా ఉన్నవారినే ఆశ్రయిస్తున్నారు. సెప్టెంబర్ 24 నుంచి రెగ్యులర్ షూటింగ్..రామోజీ ఫిల్మ్ సిటిలో ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని ఎమ్.ఎల్.కుమార్ చౌదరి తమ శ్రీ కీర్తి కంబైన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఊటీలో కానీ మౌంట్ ఆబులో కానీ చిత్రం షూటింగ్ ఉంటుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్ సి.కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి. ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు. ఇక భూమిక కూడా తాజాగా తకిట తకిట అనే చిత్రం నిర్మించి ఓ పెద్ద ప్లాప్ ని తెలుగు పరిశ్రమకు అంకితం చేసింది.


Click it and Unblock the Notifications











