కుర్ర హీరోలను భయపెడుతున్న బాలకృష్ణ
బాలకృష్ణ సినిమాలు హిట్ టాక్ వచ్చిందంటే ఆ హీరో ఫ్యాన్స్, ఈ హీరో ఫ్యాన్స్ అనే తేడా లేకుండా అందరూ వెళ్ళి చూసి వస్తూంటారు. అందుకే అన్ని ప్లాపుల తర్వాత వచ్చిన సింహా చిత్రం ఆ రేంజి ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ నవంబర్ 17న శ్రీరామ రాజ్యం చిత్రంతో వస్తున్నారు. బాపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రోమోలు, పాటలు, పోస్టర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రం కావటం, బాపు వంటి దర్శకుడు డైరక్ట్ చేయటం, మళ్లీ నయనతార, బాలయ్య కాంబినేషన్ రిపీట్ చేయటం వంటి ఎన్నో ప్రత్యేకలతో ఈ సినిమా అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ నేపధ్యంలో నవంబర్ లో విడుదల అయిన, అవుతున్న యంగ్ హీరోల చిత్రాలకు ఈ సినిమా మంచి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఇప్పటికే మొన్న నువ్విలా విడుదల అయ్యింది. మరో ప్రక్క గోపీచంద్ మొగుడు వచ్చేసాయి. రాబోయో వారంలో ఓహ్ మై ప్రెండ్, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాలు విడుదల కానున్నాయి. ఇక నవంబర్ చివరి వారంలో నాగచైతన్య బెజవాడ, నారా రోహిత్ సోలో చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వీరంతా బాలకృష్ణ సినిమా వైపే చూస్తున్నారు. ఆ సినిమాకు హిట్ టాక్ తెచ్చుకుంటే గ్యారెంటీగా తమ సినిమాపై ఆ ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. మొత్తానికి బాలకృష్ణ ఇప్పుడు యంగ్ హీరోలకు హాట్ టాపిక్ గా మారారు.


Click it and Unblock the Notifications











