»   » బంగారు బాలయ్య అంటూ ఫ్యాన్స్ హడావుడి (ఫోటోస్)

బంగారు బాలయ్య అంటూ ఫ్యాన్స్ హడావుడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు అభిమానుల సమక్షంలో బుధవారం గ్రాండ్‌గా జరిగాయి. హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అభిమానుల సమక్షంలో బాలయ్య భారీ కేక్ కట్ చేసారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు రక్తదానం చేసారు.

రక్తదానం చేయడంతో పాటు ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపినీ చేసారు. ఎన్.బి.కె హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు బాలయ్య అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఎన్.బి.కె హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ మీద....‘లెజెండ్ బంగారు బాలయ్య‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు' అని రాసి ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ భవిష్యత్తులు సేవాకార్యక్రమాలు మరింత విస్తరిస్తామని, అభిమానులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్లైడ్ షోలో బాలయ్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు..

బాలకృష్ణ
  

బాలకృష్ణ

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేస్తున్న బాలయ్య.

చిన్నారిక కేక్
  

చిన్నారిక కేక్

చిన్నారికి కేక్ తినిపిస్తున్న బాలయ్య.

బంగారు బాలయ్య
  

బంగారు బాలయ్య

బంగారు బాలయ్య అంటూ ఎంతో ప్రేమగా అభిమానులు భారీ కేక్ తయారు చేయించారు.

అభిమానులు
  

అభిమానులు

బాలయ్య పుట్టినరోజు వేడుకకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.

శుభాకాంక్షలు
  

శుభాకాంక్షలు

పలువురు బాలయ్యను పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

రక్తదానం
  

రక్తదానం

రక్తదానం చేస్తున్న అభిమానులను అభినందిస్తున్న బాలయ్య.

ప్రొత్సాహం
  

ప్రొత్సాహం

అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, తన ప్రోత్సాహం, సహకారం ఉంటుందని బాలయ్య తెలిపారు.

ఫ్యాన్స్
  

ఫ్యాన్స్

పలువురు అభిమానులు బాలయ్య పూల బొకేలు అందజేసారు.

అభివాదం
  

అభివాదం

పుట్టినరోజు వేడుకలకు వస్తూ అభిమానులకు అభివాదం చేస్తున్న బాలయ్య.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu