»   » బాలయ్య పుట్టినరోజు వేడుకలకు గ్రాండ్‌గా ఏర్పాట్లు

బాలయ్య పుట్టినరోజు వేడుకలకు గ్రాండ్‌గా ఏర్పాట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లెజెండ్' సినిమాతో భారీ విజయం అందుకోవడంతో పాటు, హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో నందమూరి నట సింహం బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో నందమూరి అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహింపబడుతున్న ఈ పుట్టినరోజు వేడుకలకు నంబూరి సతీష్, జి.ఎల్.శ్రీధర్, బి.బి.జి.తిలక్ కార్య నిర్వాహకకులుగా వ్యవహరిస్తున్నారు.

తమ నందమూరి వంశ కథానాయకుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాలుపంచుకునేందుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు నాచారం తరలి వస్తున్నట్లు బాలయ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు రక్తదానం చేయనున్నారు.

స్లైడ్ షోలో బాలకృష్ణకు సంబంధించిన వివరాలు

బాలయ్య

బాలయ్య


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా వెండితెరపై వెలుగొందుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటి వరకు 97 సినిమాల్లో నటించారు.

జూన్ 10న జన్మించారు

జూన్ 10న జన్మించారు


మద్రాసులో 1960, జూన్‌ 10న జన్మించారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌కి ఆరో సంతానం. డిగ్రీ వరకు చదువుకున్నారు. 1974లో 14 ఏళ్ళ వయసులోనే బాలనటుడిగా తాతమ్మ కల చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన రామ్‌ రహీం చిత్రంలో నటించి నటనపై తనకున్న మక్కువను చాటారు.

తండ్రి దర్శకత్వంలో

తండ్రి దర్శకత్వంలో


ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నదమ్ముల అనుబంధం' చిత్రంలో నటించి తన నటవారసత్వాన్ని కొనసాగించారు. ఆ తరువాత తన తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు.

అభిమానులు

అభిమానులు


తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రహీరోల్లో ఒకరిగా వెలుగొందిన బాలకృష్ణకు భారీగా అభిమానులు ఉన్నారు. వారి సమక్షంలో ఈ నెల 10న రామకృష్ణ స్టూడియోలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి.

English summary
Actor Balakrishna birthday celebrations on June 10th are being planned in a grand manner. The venue for this event is RK Studios at Nacharam in Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu