నేడు బాలయ్య బర్త్ డే... ఎటూ తేలని వ్యవహారం, ఎవరూ ధైర్యం చేయడం లేదా?
నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులను కొన్ని రోజులుగా ఓ సందేహం వెంటాడుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య నెక్ట్స్ మూవీ ఏది కూడా ప్రారంభం కాలేదు. మొన్నటి వరకు ఎన్నికల హడావుడి ఉంది కాబట్టి ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఇంకా సినిమా మొదలు కాక పోవడం, ఆల్రెడీ ప్రకటించిన ప్రాజెక్టులు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు కన్‌ఫ్యూజన్లో ఉన్నారు. అయితే బాలయ్య పుట్టినరోజు (జూన్ 10) నాటికి విషయం ఎటో ఒక వైపు తేలుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు.

ఆ మూవీ పరిస్థితి ఏమిటి?
వాస్తవానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మాతగా ఓ సినిమా అనుకున్నారు. ఎన్నికల తర్వాత ఇది ప్రారంభం అవ్వాల్సి ఉండగా స్క్రిప్టులో మార్పుల పేరుతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గెలుపు నేపథ్యంలో కథలో మార్పులు చేస్తున్నారని టాక్. కాగా.. జూన్ 12న ఈ చిత్రాన్ని ఫార్మల్‌గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

స్క్రిప్టుతో సిద్ధంగా ఉన్న బోయపాటి
అయితే బాలయ్యతో సినిమా చేయడానికి గతంలో ఆయనకు సింహా, లెజెండ్ లాంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను స్క్రిప్టుతో సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు ప్రపోజ్ చేసి బడ్జెట్ పెట్టడానికి ఎవరూ సాహసం చేయడం లేదట. మొదట దీన్ని బాలయ్యే నిర్మించాలుకున్నారట, అంత బడ్జెట్ పెట్టలేక వెనక్కి తగ్గినట్లు టాక్.

ఎవరూ ధైర్యం చేయడం లేదా?
బోయపాటి సినిమా అంటేనే భారీ యాక్షన్ సీన్లు ఉంటాయి. సినిమా గ్రాండ్‌గా ఉంటుంది. బాలయ్య లాంటి హీరో ఉంటే ఆయన ప్లాన్స్ మరో స్థాయిలో ఉంటాయి. అందుకే రూ. 65 కోట్ల బడ్జెట్ ప్రపోజ్ చేశాడట. ఈ సినిమాను నిర్మించే విషయమై అనిల్ సుంకర, దిల్ రాజుతో చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదని టాక్.

అతడితో బోయపాటి సంప్రదింపులు?
గతంలో తన దర్శకత్వంలో ‘జయ జానకి నాయక' చిత్రాన్ని నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డితో బోయపాటి చర్చలు జరుపుతున్నట్లు కూడా మరో రూమర్ ప్రచారంలో ఉంది. మరి అంత బడ్జెట్ పెట్టడానికి అతడు ముందుకు వస్తాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

బాలయ్య పుట్టినరోజు నేడు
ఆ సంగతి పక్కన పెడితే... జూన్ 10, 1960లో జన్మించిన బాలయ్య నేడు 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ‘తాతమ్మకల' మూవీతో 1974లో తన కెరీర్ మొదలు పెట్టిన ఆయన టాలీవుడ్ అగ్రహీల్లో ఒకరిగా ఎదిగారు. వందకుపైగా చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











