twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌హౌస్‌లో బాలకృష్ణ హంగామా

    By Srikanya
    |

    హైదరాబాద్ : బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై తెరకెక్కిస్తున్నారు.గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనీల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలోని బిగ్‌ (ఠాగూర్‌) హౌస్‌లో జరుగుతోంది. బాలకృష్ణ, సితార, చలపతిరావులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

    అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ స్పెషల్ బైక్ పై కనిపించి ఫ్యాన్స్ ని అలరించనున్నారు. బాలకృష్ణ ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కున్న సినిమా కోసం ఈ బైక్ ని సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణ పాత్ర కోసం ఓ స్పెషల్ బైక్ ని సిద్దం చేసారు. ఈ బైక్ తయారీ కోసం స్పెషల్ డిజైనర్స్ ని పిలిపించారు. ఈ బైక్ పై కస్టం పెయింటింగ్స్ మరియు స్టైలిష్ చక్రాలు ఉండనున్నాయి.

    ఈ సినిమా 2014 ప్రారంభంలో ఈ చిత్రం విడుదల అవుతున్నారు. సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం. ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.

    అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు. బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా అన్నారు.

    English summary
    Nandamuri Balakrishna is busy shooting in Ramoji Film City for an untitled film under Boyapati Seenu’s direction. Major scenes of the film are being shot in the combination of Balakrishna and Jagapathi Babu who is playing villain. Sonal Chauhan is playing female lead and another heroine is yet to be finalized. There are lot of expectations on this film as Balakrishna is acting under Boyapati’s direction after blockbuster Simha. Devisri Prasad is composing music for the first time for Balakrishna. 14 Reels Entertainment is producing this message oriented mass entertainer. There are rumors in film nagar that Ruler is the title of the film but the makers didn’t confirm it yet. This film will hit the screen before 2014 general elections.
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X