బాలకృష్ణ ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్
దర్శకుడు బోయపాటి శ్రీను సారథ్యంలో రాజకీయ ప్రాధాన్యం కలిగిన చిత్రంలో తాను నటిస్తున్నానని, ఎన్నికల నాటికి ఇది విడుదల చేస్తామని, నేటి రాజకీయాల్లో అవినీతి, అవకతవకలను ఈ చిత్రంలో చూపిస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని, పార్లమెంట్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్‌లో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.


Click it and Unblock the Notifications












