»   » హీరో బాలకృష్ణ ఓ ‘లెజెండ్’... నిజమేనా?

హీరో బాలకృష్ణ ఓ ‘లెజెండ్’... నిజమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి 'లెజెండ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమా స్టోరీలైన్‌కు ఇది పర్ ఫెక్టుకుగా సూటయ్యే విధంగా ఉంటుందని అంటున్నారు. మరి ఇదే టైటిల్ ఖరారు చేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.

ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ స్పెషల్ బైక్ పై కనిపించి ఫ్యాన్స్ ని అలరించనున్నారు. ఈ బైక్ తయారీ కోసం స్పెషల్ డిజైనర్స్ ని పిలిపించారు. ఈ బైక్ పై కస్టం పెయింటింగ్స్ మరియు స్టైలిష్ చక్రాలు ఉండనున్నాయి. సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే భారీ అంచనా అభిమానుల్లో ఉండటం సహజం.

ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా కనుక అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.

నగ్నంగా నటించడానికి, శృంగార సీన్లలో రెచ్చిపోవడానికి ఏ మాత్రం సంకోచించని పూనమ్ పాండేను‌ ఈ సినిమాకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఆమె ఐటం సాంగు చేయబోతోందా? లేక ఏదైనా ప్రత్యేక పాత్రలో కనిపించబోతోందా? అనేది తేలాల్సి ఉంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌‌ను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉంది. జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'సింహా' తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.

English summary
Film Nagar sources said that, Balakrishna’s upcoming film in Boyapati Sreenu’s direction is going to be titled ‘Legend’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu