twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయపాటికి మరో ఛాన్స్ లేదు... అప్పటి వరకు వెయిటింగే!

    |

    'వినయ విధేయ రామ' బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన తర్వాత దర్శకుడు బోయపాటి ఫేమ్ ఒక్కసారిగా పడిపోయింది. అందుకు కారణం ఈ చిత్రంలో బోయపాటి డిజైన్ చేసిన కొన్ని సీన్లే. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉన్న ఆ సన్నివేశాలు.. ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగడానికి కారణమైంది. ఈ ఎఫెక్ట్ బోయపాటి కెరీర్ మీద పడింది. ఆయనతో సినిమాలు చేయడానికి సుముఖంగా ఉన్న పలువురు స్టార్ హీరోలు ఈ ఫలితం తర్వాత సైడ్ అయిపోయారు. ఆయనకు కమిట్మెంట్ ఇచ్చిన నిర్మాణ సంస్థలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బాలయ్య రూపంలో ఆపన్న హస్తం అందింది బోయపాటికి.

    హిట్టు కొట్టి తీరాలి

    హిట్టు కొట్టి తీరాలి

    తనకు సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాలు అందించిన బోయపాటికి మరో ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. అన్ని వైపులా దారులు మూసుకుపోయిన వేళ బాలయ్యతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పెద్ద హిట్టు కొట్టి మళ్లీ తన పేరు నిలబెట్టుకోవాలని బోయపాటి కసిగా వెయిట్ చేస్తున్నారు.

    బోయపాటి ఈ నెల్లోనే ప్లాన్ చేశాడు కానీ..

    బోయపాటి ఈ నెల్లోనే ప్లాన్ చేశాడు కానీ..

    స్క్రిప్టు సిద్ధం చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు బోయపాటి. మార్చి నుంచే రెగ్యులర్ షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా ఈ చిత్రం ఇప్పుడు మొదలయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది.

    అప్పటి వరకు వెయింటింగ్ తప్పదు

    అప్పటి వరకు వెయింటింగ్ తప్పదు

    ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి బాలయ్య తెలుగు దేశం పార్టీ తరుపున ప్రచార కార్యక్రమాల్లో బిజీ కాబోతున్నారు. ఈ సమయంలో షూటింగ్ పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. అందుకే జూన్ వరకు వెయిట్ చేయాలని బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది.

    ఇద్దరికీ హిట్టు అవసరమే..

    ఇద్దరికీ హిట్టు అవసరమే..

    ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన నేపథ్యంలో ఇటు బాలయ్యకు కూడా హిట్టు పడాల్సిన అవసరం ఏర్పడింది. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన ఈ కాంబినేషన్ మరోసారి సక్సెస్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

    English summary
    Balakrishna, Boyapati Srinu movie in maybe start in June. Actually Boyapati Srinu is ready with the script. He wanted to commence the regular shooting in March. But, Balakrishna has reportedly asked him to wait till June because of AP Election.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X