ఫోటోలు : బాలకృష్ణ-బోయపాటి మూవీ ఓపెనింగ్
హైదరాబాద్ : 'సింహ' లాంటి భారీ విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు సాదాసీదాగా జరిగింది. దేవుడి చిత్రపాలపై చిత్రీకరించిన ముమూర్తపు షాట్‌కు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటిలు కెమెరా స్విచాన్ చేసారు. దర్శకుడు బోయపాటి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
సినిమా ప్రారంభం నేపథ్యంలో రెండు రోజుల క్రితమే బోయపాటి తిరుమలను సందర్శించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసారు. సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.
ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇప్పటికే వేరే నిర్మాత రిజిస్టర్ చేసుకోవడంతో పాటు దాన్ని బాలయ్య కోసం ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'జయసింహ' టైటిల్ ఈ చిత్రానికి ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బాలకృష్ణ క్లాప్ కొట్టారు.

బాలకృష్ణ-బోయపాటి మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాతలు

ముహూర్తపు సన్నివేశానికి బాలయ్య క్లాప్ కొట్టగా, నిర్మాతలు రామ్, గోపీచంద్, అనిల్, సాయికొర్రపాటి కెమెరా స్విచాన్ చేసారు.

ఈ సినిమా గురించి బోయపాటి మాట్లాడుతూ....'సింహా'ని మించే సినిమా తీస్తా, అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు


Click it and Unblock the Notifications











