Nandamuri Ramakrishna: నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయన కారు!

నందమూరి కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెల 27న గుండెపోటుతో తారకరత్న ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. బెంగళూరులోని నారాయణ హృదాయలయ వైద్యులు తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆయన శరీరం ట్రీట్ మెంట్ కు సహకరిస్తుందని, ఆరోగ్యం మెరుగువతుందని వైద్యులు తెలిపారు. అయితే తారకరత్న పూర్తిగా మాత్రం కోలుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని నందమూరి కుటుంబసభ్యులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాగే నిత్యం తారకరత్న ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. ఈ సమయంలో నందమూరి ఇంట మరో విషాదకర సంఘటన జరగడం కలచి వేస్తుంది.

నందమూరి కుటంబంలో మరో వ్యక్తి రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కారు ప్రమాదంలో రామకృష్ణకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. కానీ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Balakrishna Brother Nandamuri Ramakrishna Met With Car Accident Has Minor Injuries

అయితే ఇలా నందమూరి కుటుంబంలో ఇలా వరసు విషాదా ఘటనలు చోటుచేసుకోవడంతో అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా నందమూరి రామకృష్ణ ఇటీవల బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తారకరత్నను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని రామకృష్ణ తెలిపారు. ఎక్మో ఏం పెట్టలేదని.. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. తారకరత్న శరీర అవయవాలు అన్నీ బాగా పనిచేస్తున్నాయని.. న్యూరో రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని రామకృష్ణ చెప్పుకొచ్చారు.

Balakrishna Brother Nandamuri Ramakrishna Met With Car Accident Has Minor Injuries

అలాగే ఆ మధ్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై కూడా రామకృష్ణ తన గళం వినిపించారు. యూనివర్సిటీకీ ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని చెప్పొకొచ్చారు. అన్నీ మెడికల్ కాలేజీలో ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన అని.. ఆ ఉద్దేశంతోనే 1986లో మెడికల్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించినట్లు వివరించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికీ నందమూరి కుటుంబంలో నందమూరి హరికృష్ణ, నందమూరి జానకీ రామ్ లు కారు యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. తాజాగా కారు ప్రమాదంలో గాయపడిన రామకృష్ణకు గతంలో కూడా ఒకసారి యాక్సిడెంట్ జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X