వాషింగ్ టన్ లో బాలకృష్ణ హల్ చల్...కేక్ కటింగ్...!
గత పదిహేను రోజుల నుంచీ నందమూరి బాలకృష్ణ అమెరికాలోని పలు నగరాలలో పర్యటిస్తూ ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదులో తమ నిర్వహణలో రోగులకు విశేష సేవలందిస్తున్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి విరాళాలు సేకరించారు. ఇందులో భాగంగా నిన్న బాలకృష్ణ వాషింగ్టన్ నగరానికి వచ్చారు. అభిమానులు భారీ కార్ల ర్యాలీతో, బాణసంచా కాలుస్తూ తమ అభిమాన నటుడికి అపూర్వరీతిలో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను బాలకృష్ణ కట్ చేసి సందడి చేశారు. ప్రవాసాంధ్రుల నుంచి సేకరించిన లక్షా ముప్పై వేల డాలర్ల విరాళాన్ని నిర్వాహకులు బాలకృష్ణకు అందజేశారు. నేటితో బాలకృష్ణ అమెరికా పర్యటన దాదాపు పూర్తయింది.
బాపు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా రూపుదిద్దుకొంటున్న 'శ్రీ రామరాజ్యం" చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకొని సెప్టెంబరులో విడుదలకు సిద్దమవుతుంది. శ్రీ రామరాజ్యం" చిత్రం బాపు దర్శకత్వంలో.యలమంచిలి సాయిబాబు నిర్మాణ సారధ్యంలో ,ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతంతో రూపుదిద్దుకొంది.


Click it and Unblock the Notifications











