ఆ అయిదుగురు దర్శకులతో బాలయ్యబాబుకే సాద్యం..!

By Nageswara Rao

దాసరి నారాయణరావు బాలయ్యబాబు నటిస్తున్న చిత్రం పరమవీరచక్ర. ఈ సినిమాలో బాలయ్యబాబు రెండు వైవిధ్యమైన గెటప్స్ లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి సైనికాధికారిగా సరిహాద్దుల్లో పోరాడేదికాగా, రెండవది సినిమా హీరోగా కనిపించనున్నారు. ఐతే ఈ సినిమాకి ఎంతో ప్రత్యేకత ఉంది. దానికి కారణం ఈసినిమా దాసరినారాయణరావుకి 150 చిత్రం కావడంతోపాటు, బాలయ్యబాబు సింహా లాంటి బంఫర్ బ్లాక్ బాస్టర్ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కాబట్టి. అంతేకాకుండా ఈ చిత్రం పై అభిమానులు ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఇంకోక కొత్త విశేషం కూడా ఉంది. అదేంటంటే సినిమాలో బాలయ్యబాబు సినిమా హీరోగా నటిస్తున్నారు కాబట్టి, కధలో సినీ నేపధ్యం కూడా ఉంటుంది కాబట్టి అయిదుగురు దర్శకులు ఈ సినిమాలో కనిపించనున్నారు. బి.గోపాల్, శ్రీను వైట్ల, సింగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, ఎస్.శంకర్ లాంటి మహా మహా ఉధ్ధండలు ఈసినిమాలో కనిపించి బాలయ్యబాబు అభిమానులను ఉత్సాహాపరచనున్నారు. ఈ చిత్రంలో బాలయ్యబాబు సరసన అమీషా పటేల్, షీలా, నేహాధూపియా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. కళ్యాణి కూడా మరో ముఖ్యమైన భూమికను పోషించనుంది. ఈ చిత్రం టాకీ దాదాపుగా 50శాతం పూర్తి అయింది. ప్రస్తుతం కులు మానాలిలో పతాక సన్నివేశాలు తీయడం జరుగుతుందన్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాని దాసరి శిష్యుడు సి.కళ్యాణ్ నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X