»   » నాగ్, బాలయ్య ఇద్దరూ వెరీగుడ్

నాగ్, బాలయ్య ఇద్దరూ వెరీగుడ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఈ రోజు జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో సినీనటుడు అక్కినేని నాగార్జున, అమల దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నాగార్జున మీడియాతోమాట్లాడుతూ..ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ద్వారా మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలని సూచించారు.

Balakrishna casts his vote

అఖిల్‌కు ఓటు లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరంలో ఈసారి ఓటింగ్‌ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రం వద్ద నాగార్జునతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు.

మరో ప్రక్క జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలబ్రెటీలు ఒక్కొక్కరే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని, వాటిని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా పోస్ట్ చేసి తమ అభిమానులకు ప్రేరణగా నిలుస్తున్నారు.

Read more about: balakrishna
English summary
Hindupur MLA and Cine actor N. Balakrishna casts his vote at BSNL Office booth in Jubilee Hills.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu