మనవడితో బాలయ్య బర్త్ డే సంబరాలు.. వైరల్ ఫోటో!
నందమూరి నటసింహం బాలయ్య జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బాలకృష్ణ 58 వ పడిలోకి అడుగుపెట్టాడు. ఇటు సినిమాల్లో కథానాయకుడిగా, అటు రాజయాల్లోకి ప్రజా ప్రతినిధిగా బాలకృష్ణ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఇదిలా ఉండగా బాలయ్య తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకుని సంతోషంగా గడిపారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకలకు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

బాలయ్య తన ముద్దుల మనవడు నారా దేవాన్ష్ తో పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నాడు. దేవాన్ష్ బాలయ్యకు కేక్ తినిపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











