బాలయ్య ఓపెన్ ఛాలెంజ్!

శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లాకు చెందిన గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఇతర సీనియర్ నేతలు బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వారిని అభినందించడానికి బాబు ఇంటికి వచ్చారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలిచ్చారు. ప్రస్తుతం పోటీ చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ఇప్పుడు అలాంటిదేమీ లేదని, కేవలం ప్రచారం మాత్రం చేస్తానని చెప్పారు.
"ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ప్రచారాన్ని ప్రారంభిస్తా. అయితే ప్రస్తుతం జిల్లాలకు వెళుతున్నది ప్రచారానికి కాదు.. మా తండ్రి ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణకు'' అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒకవేళ పోటీ చేస్తే పార్లమెంటుకా? అసెంబ్లీకా? అంటూ విలేఖరులు ప్రశ్నల వర్షం కురిపిస్తే.. "అసలు పోటీ చేసే నిర్ణయమే తీసుకోలేదు. పార్లమెంటుకా? అసెంబ్లీకా? అంటే ఏం చెప్పాలి?'' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.మొత్తానికి మలేషియా నుంచి వచ్చన బాలయ్య తన పంజా విసిరే రీతీలో మాట్లాడారంటూ అంతా మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











