చేతులు కలుపనున్న బాలయ్య, ఎన్టీఆర్... 7 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై బాబాయ్ అబ్బాయ్
అరవింద సమేత చిత్రం బాబాయ్, అబ్బాయిలను మరోసారి కలపడానికి రంగం సిద్ధమైంది. ఆదివారం అరవింద సమేత చిత్రం సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చాలా ఏళ్ల తర్వాత బాలయ్య, యూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడం విశేషంగా మారింది. బాబాయ్, అబ్బాయ్ కలువబోతున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. అక్టోబర్ 11న రిలీజైన అరవింద సమేత భారీ విజయం వైపు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

అరవింద మూడో సక్సెస్ మీట్
అరవింద సమేత చిత్రానికి ఇది మూడో సక్సెస్ మీట్. రిలీజ్ రోజే సినిమా భారీ వసూళ్లు సాధిస్తున్నదనే విషయాన్ని చెప్పడానికి దర్శకుడు త్రివిక్రమ్, సునీల్, పంపిణీదారు, నిర్మాత దిల్ రాజు తదితరులు కలిసి సక్సెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు.

100 కోట్లు అధిగమించి
అరవింద సమేత కలెక్షన్లతో దూసుకెళ్తూ వారాంతంలోనే రూ.100 కోట్లు సాధించడంతో మరోసారి సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకు ఎన్టీఆర్‌తోపాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అరవింద సమేత వంద కోట్ల మార్కును దాటిందని చెప్పారు.

మూడో సక్సెస్ మీట్‌కు బాలయ్య
కొంత కాలంగా అంటి ముట్టనట్టు ఉంటున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మూడో సక్సెస్ మీట్ సందర్బంగా కలుస్తున్నారనే వార్త ఇరు హీరోల ఫ్యాన్స్‌కు పండుగగా మారింది. శిల్పకళా వేదికలో నిర్వహించే వేడుక ఇరు హీరోల అభిమానులకు నిజమైన పండుగగా మారనున్నది.

ఏడేళ్ల తర్వాత బాలయ్య, ఎన్టీఆర్
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదిక మీద కనిపించి ఏడేళ్లు అయింది. గతంలో బాలయ్య నటించిన పరమ వీర చక్ర చిత్ర ఆడియోకు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అప్పటి నుంచి వారిద్దరూ ఒకే వేదిక మీద కనిపించిన దాఖలాలు లేవు.

హరికృష్ణ మృతి తర్వాత
దివంగత హరికృష్ణ మరణం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబాలను దగ్గరకు చేసిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబుకు బాలకృష్ణ సన్నిహితంగా ఉండటం కారణంగా హరికృష్ణ, పురందేశ్వరి తదితర కుటుంబాలు అంటి ముట్టనట్టు కనిపించారు.

రూ. 150 కోట్ల మార్కు
కాగా, అరవింద సమేత చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం రూ.150 కోట్ల మార్కును అధిగమించే ఛాన్స్ కనిపిస్తున్నది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన కెరీర్‌లో నికరంగా రూ.70 కోట్ల మార్కును దాటలేదు. టాలీవుడ్‌లో ఈ మార్కును అధిగమించిన వారిలో మహేష్, రాంచరణ్, విజయ్ దేవరకొండ తదితరులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











