బాలకృష్ణ సినిమాకు చిన్నికృష్ణ కథ

By Staff

బాలకృష్ణ, చిన్ని కృష్ణ కాంబినేషన్‌లో మరో సినిమా ప్రారంభం కానుంది. గతంలో బి. గోపాల్‌- బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ చిత్రం నరసింహ నాయుడు సినిమాకు కథను సమకూర్చిన చిన్ని కృష్ణ మళ్ళీ గోపాల్‌- బాలకృష్ణల సినిమాకు కథను తయారు చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ సినిమాను భగవాన్‌, దానయ్యలు నిర్మించనున్నారు. బాలకృష్ణ- బి.గోపాల్‌ కాంబినేషన్‌లో గతంలో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లారీ డ్రైవర్‌ వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. రచయితగా స్టార్‌డం సంపాదించుకున్న చిన్ని కృష్ణ దర్శకుడిగా మారడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ కల సాకారం కాకపోవడంతో మళ్ళీ బాలకృష్ణ సినిమాకు రచయితగా వెలుగులోకి వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X