చిరు ధైర్యం చెప్పిన బాలయ్య?
శ్రీజ రహస్య పెళ్లి సినిమా ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపింది. చాలామందిని నిశ్చేష్టులను చేసింది. చిరంజీవి షాక్ కు గురైనట్టే చాలామంది షాక్ కు గురయ్యారు. చిరంజీవిని పరామర్శించాలో వద్దో తెలియని పరిస్థితి. ఇప్పటికే చాలామంది చిరంజీవిని కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. అందులో హీరో బాలకృష్ణ కూడా ఉన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. చిరంజీవి ఇంటికి వెళ్లి బాలకృష్ణ ధైర్యం చెప్పినట్టు తెలిసింది. శ్రీజ రహస్య వివాహం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ మొత్తం దిగ్బ్రాంతికి గురైందని బాలకృష్ణ అన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి ఇంట్లో బాలకృష్ణ గంటకుపైగా గడిపినట్లు తెలిసింది. చిరంజీవి, ఆయన సతీనణితోబాటు ఇతర కుటుంబ సభ్యులను పలకరించిన బాలకృష్ణ, చిరంజీవి కుటుంబానికి తెలుగు సినీ పరిశ్రమ తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications