అల్లరి మూకలు అనుకున్నా.. మీడియా మిత్రులారా సారీ: బాలయ్య వివరణ
Recommended Video

హిందూపురం ఎన్నికల ప్రచారంలో మీడియా ప్రతినిధిపై దాడి, దుర్భాషలాడిన ఘటనపై బాలకృష్ణ... ఎట్టకేలకు దిగి వచ్చారు. ఈ సంఘటన తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రియలైజ్ అయిన ఆయన క్షమాపణలు కోరుతూ ప్రకటన చేశారు.
అయితే బాలయ్య క్షమాపణలు చెబుతూ ప్రకటన చేసే సమయానికే... జరుగాల్సిన నష్టం జరిగింది. ఈ వీడియోను అన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి. బాలయ్య తీరును ఏకిపారేశాయి. మరి బాలయ్య క్షమాపణలతో మీడియా శాంతిస్తుందా?.. ఇంతకీ బాలయ్య అలా ప్రవర్తించడంపై ఏం వివరణ ఇచ్చారో ఓ లుక్కేద్దాం.

అల్లరిమూకల పని అని భావించాను
ఇవాళ నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది, అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు.. అని బాలయ్య తెలిపారు.

బాధ కలిగించి ఉంటే క్షమించండి
నా ప్రవర్తన వల్ల మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నాను.. అంటూ బాలయ్య తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీ ద్వారా వివరణ ఇచ్చారు.

అసలు ఏం జరిగిందంట..
బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగిపడేసే ప్రయత్నం చేశారు. దీన్ని షూట్ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలని చేయి చేసుకున్నారు.

రెచ్చిపోయిన బాలయ్య
దీనిపై వెంటనే బాలయ్య రియాక్ట్ అవుతూ... ‘రాస్కెల్ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు' అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యాయి.


Click it and Unblock the Notifications











