టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే.. కల్యాణ్ రామ్ మల్టీస్టారర్‌పై బాలకృష్ణ క్లారిటీ
నందమూరి బాలకృష్ణ ముక్కుసూటిగా మాట్లాడుతారనే విషయం సినీ వర్గాలు చెప్పుకొంటాయి. ఆయన మనసులో ఏది నచ్చితే చేస్తారు. ఏది అనిపిస్తే అది మాట్లాడుతారు. అలాంటి బాలకృష్ణ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా యోయో యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్య అంశాలు..

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ గురించి
నా జీవితంలో స్వర్గీయ ఎన్టీఆర్ నాకు దైవం, స్పూర్తి అన్నీ ఆయనే. అందుకే ప్రతీ రోజు నాన్నగారి సినిమాలు చూస్తుంటాను. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ఫ్లామ్‌లో సినిమాలు చూస్తాను. ఎన్ని ఉన్నా నాన్నగారి సినిమాలు చూడంది పడుకోను. షూటింగ్ ఉంటే మాత్రం కనీసం 10 లేదా 15 నిమిషాలు మాత్రమే సినిమా చూస్తాను అని బాలకృష్ణ చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే..
టీడీపీలోకి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీ బలోపేతం అవుతుందనే విషయంపై బాలకృష్ణ మాట్లాడుతూ.. జూ.ఎన్టీఆర్ వస్తే స్వాగతిస్తాం. వచ్చే వారి అంకితభావాన్ని బట్టి వారికి ఫలితం దొరుతుంది. కాకపోతే జూ.ఎన్టీఆర్‌కు చాలా సుదీర్ఘమైన కెరీర్ ఉంది. ఎన్టీఆర్‌కు రాజకీయాల్లోకి రావడానికి చాలా సమయం ఉంది. అతనికి ఇష్టం ఉంటే మాకు సంతోషం అని బాలకృష్ణ అన్నారు.

మల్టీస్టారర్ సినిమాలు చేయను
నాకు మల్టీస్టారర్ చిత్రాలు చేయడం ఇష్టం లేదు. గతంలో కొన్ని సినిమాలు చేదు అనుభవం మిగిల్చింది. అందుకే మల్టీస్టారర్ సినిమాలు చేయదలుకోలేదు. నాన్నగారు, ఏఏన్నాఆర్ కలిసి ఎన్నో చిత్రాలు నటించారు. చాలా సినిమాలు నిరాశను కలిగించాయి. నాకు కొన్ని అసంతృప్తిని కలిగించాయి. అందుకే మొహమాటం లేకుండా నటించనని చెబుతాను.

నందమూరి హీరోలతో మల్టీస్టారర్
మల్టీస్టారర్ సినిమాలు చేయకుండా సోలో హీరో సినిమాలు చేసుకొంటాను. నేను ఏదైనా అభిప్రాయాన్ని చెప్పానంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది. నాన్నగారి అన్ని విషయాల్లో పాటిస్తాను. పదవులు మాకు అలంకారం కాదు. పదవులకు మేమే అలంకారం అని అన్నారు. కొన్ని కథలు నచ్చి కొందరు హీరోలకు కాల్ చేస్తే సమాధానం చెప్పలేదు. అందుకే ఐ డోంట్ రెస్పక్ట్ దేమ్ అంటూ అన్నారు.
Recommended Video

కల్యాణ్ రామ్ నిర్మాతగా చేస్తే
కల్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా తీస్తే మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మంచి కథ దొరికితే నందమూరి హీరోలతో కలిసి మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించాలని ఉంది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లతో కలిసి నటించడానికి సిద్ధం. కాకపోతే మంచి కథ దొరకాలి. మంచి కథ దొరికితే అభిమానుల కలను నిజం చేయడానికి ప్రయత్నిస్తాను. చాలా మంది మల్టీస్టారర్ చిత్రాలకు సంబంధించి కథను చెప్పారు. కానీ అంతగా నచ్చలేదు అని బాలకృష్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











