ఆ రామారావు... ఈ బాలకృష్ణ అంటూ వారసత్వంపై బాలయ్య హాట్ కామెంట్!

By Bojja Kumar

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం "జై సింహా". సి.కె.ఎంటర్ టైనమెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించారు. కే.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21తో వందరోజులు పూర్తి చేసుకొంది. ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వారసత్వం గురించి బాలయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Recommended Video

Balakrishna Emotional Speech On NTR Biopic Release
 నాన్నగారిని స్మరించుకుంటూ

నాన్నగారిని స్మరించుకుంటూ

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఏ విషయంలో అయినా నాకు స్పూర్తి, దైవం, గురువు నాన్న గారే. ఎన్నో సందర్భాల్లో నేను ఈ విషయం చెప్పాను. ఎలాంటి పాత్ర పోషించినా సరే ఆయన్ను స్మరించుకుంటూ ఆ పాత్రలోకి ఒదిగిపోయి, ఆ పాత్రలో జీవించి నా వరకు నేను చేస్తాను.... అని బాలయ్య తెలిపారు.

జీవించే వాడే వారసుడు

జీవించే వాడే వారసుడు

నాన్న గారు చెబుతుండే వారు....‘అనుకరించే వాడు వారసుడు కాదు, ఏ పాత్రలో అయినా సరే జీవించేవాడే వారసుడు' అని, అలా ఆయన్ను స్పూర్తిగా తీసుకుని, ఆ పాత్రలకు న్యాయం చేస్తూ అటు పౌరాణికం, ఇటు జానపదం, చారిత్రాత్మకం, సాంఘీక చిత్రాలు చేస్తూ వెళుతున్నాను.... అని బాలయ్య తెలిపారు.

ఆ రామారావుకైనా, ఈ బాలకృష్ణకైనా

ఆ రామారావుకైనా, ఈ బాలకృష్ణకైనా

ఇటువంటి మంచి అవకాశాన్ని ఆ రామారావుకైనా, ఈ బాలకృష్ణకైనా ఇచ్చి మేమెన్ని ఒరవడులు సృష్టించినా వాటిని ఆదరించి, ఆశీస్సులు అందించి, విజయవంతం చేసి ఇంకా ఎన్నో వైవిద్య భరితమైన మంచి చిత్రాలు చేయడానికి అవకాశం ఇచ్చిన నా తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ ధన్యవాదాలు అని బాలకృష్ణ తెలిపారు.

 ఆంధ్రా, తెలంగాణ అయినా

ఆంధ్రా, తెలంగాణ అయినా

తెలుగు వారు ఎక్కడున్నా ఆంధ్రాకానీ, తెలంగాణ కానీ, మన పొరుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా నాలుగు సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. మహారాష్ట్రలోని షోలాపూర్, ప్రొద్దుటూరు, ఎమ్మిగనూరు, చిలకలూరి పేటల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇలా మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించి విజయాల పరంపర అందించడం ద్వారా ఇంకా ఎన్నెన్నో పాత్రలు చేయడానికి మీరు మాకు ఉపిరి పోస్తున్నారు.. అని బాలకృష్ణ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X