నందమూరి బాలకృష్ణ 20 లక్షల విరాళం
వరద బాధితుల సహాయార్థం ఇహం పరం బేధాల్లేకుండా తలో చేయి వేస్తోన్న నేపథ్యంలో నదమూరి యువరత్న బాలకృష్ణ కూడా తనవంతుగా ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందించిరు.బాలయ్య. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన చెక్‌ను అందజేశారు. అంతే కాక వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ తారలంతా కలిసి ఒక కార్యక్రమాన్ని చేయుటకు ప్లాన్ చేసేలా బాలయ్య ప్రోత్సహించారు. నిర్మాత రామానాయుడు పది లక్షలు, నిర్మాత వెంకట్ అయిదు లక్షలు, అల్లు అర్జున్ అయిదు లక్షలు జూ.ఎన్టీఆర్ మరో ఇరవైలక్షలు ఇలా సినిమా వారంతా బాధితుల్ని ఆదుకునేందుకు తమ వంతుగా విరాళాలిస్తున్నిరు. అలాగే 'మహాత్మ" డిస్ట్రిబ్యూలర్లు టిక్కెట్ పై వచ్చిన డబ్బుల్లో కొంత వరద బాధితులకి అందించాలని నిర్ణయించారు. 'మగదీర" చిత్రం బెనిఫిట్ ద్వారా కూడా బాధితులకి అదుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











