twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొడవాటి వ్యక్తుల మధ్య ఓ పొట్టోడిని: బాలయ్య, ఈ కామెంట్స్ వెనుక కారణమదే!

    |

    Recommended Video

    పొడవాటి వ్యక్తుల మధ్య ఓ పొట్టోడిని.. బాలయ్య, ఈ కామెంట్స్ వెనుక కారణమదే !

    తెరపై తన డైలాగ్స్‌తో సింహంలా గర్జించే నటసింహం నందమూరి బాలకృష్ణ.. వేదికల మీద మాత్రం కాస్త తటపటాయించడం చూస్తూనే ఉంటాం. అలాగే తోచిందేదో మాట్లాడేసి కొన్నిసార్లు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు.

    కొంతమందికి ఇదంతా ఆయన భోళాతనంలానూ కనిపించవచ్చు. సరే, ఇదంతా పక్కనపెడితే బాలకృష్ణ చేసిన తాజా వ్యాఖ్యలపై మాత్రం ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇది మా హీరో గొప్పతనం అని ప్రశంసిస్తున్నారు..

    విషయమేంటి?:

    విషయమేంటి?:

    సోమవారం 'జైసింహా' సక్సెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా బాలయ్య మాట్లాడారు. సినిమాల్లో సాధారణంగా హీరోల పక్కన.. వాళ్ల కన్నా ఎత్తున్నవారిని పెట్టరు. కానీ బాలయ్య మాత్రం అలాంటి భేషజాలేమి అక్కర్లేదని చెప్పారట. తన కంటే ఎత్తు ఉన్నంత మాత్రాన వాళ్లను సినిమాలో పెట్టుకోకూడదా? అని ఆలోచించారట.

    బాలయ్య కంటే ఎత్తు ఉన్నాడని..:

    బాలయ్య కంటే ఎత్తు ఉన్నాడని..:

    మాటల మధ్యల 'నరసింహనాయుడు' టైమ్ లో జరిగిన ఓ సంఘటనను కూడా గుర్తుచేసుకున్నారు బాలయ్య. ఆ సమయంలో సినిమాలో గెటప్ కోసం ఎవరో ఆఫీసుకు వచ్చారట. కానీ వచ్చిన వ్యక్తి బాలయ్య కన్నా ఎక్కువ ఎత్తు ఉండటంతో తిప్పి పంపించేశారట.

     నచ్చజెప్పిన బాలయ్య..:

    నచ్చజెప్పిన బాలయ్య..:

    ఆ వ్యక్తిని తిప్పి పంపించేశారన్న విషయం బాలయ్యకు తెలియడంతో.. 'కళామతల్లి'ని నమ్ముకుని వచ్చినవాళ్లను అలా పంపించవద్దని చిత్ర యూనిట్ కు నచ్చజెప్పారట. కేవలం హీరో కన్నా ఎక్కువ ఎత్తు ఉన్నారన్న కారణంగా అవకాశం ఇవ్వకపోవడం సరైంది కాదని చెప్పారట.

    ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన?:

    ఇప్పుడెందుకు ఆ ప్రస్తావన?:

    జైసింహా సినిమా విషయంలోనూ నటీనటుల ఎంపిక వద్ద 'ఎత్తు' ప్రస్తావన వచ్చిందట. అందుకే బాలయ్య దానిపై మాట్లాడారు. 'సినిమాలో నా స్నేహితులుగా నటించిన విజయ్ కూడా నాకంటే పొడవే. అందరి పొడవాటి వ్యక్తుల మధ్య ఓ పొట్టోడిని నేను. సినిమాల్లో పాత్రలు ముఖ్యమంతే. మిగతా వాటిని పట్టించుకోకూడదు' అని అన్నారు.

     వాళ్లంతా బాలయ్య కంటే ఎత్తే..:

    వాళ్లంతా బాలయ్య కంటే ఎత్తే..:

    జైసింహా సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన ప్రభాకర్(కాలకేయ) బాలయ్య కంటే ఎత్తు. అలాగే నయనతార భర్తగా నటించిన కరతార్ సింగ్ కూడా బాలయ్య కంటే ఎత్తే. హీరోలుగా కంటే ఎత్తుగా ఉన్నారన్న కారణంతో నటుల్ని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదనే విషయం చెప్పడానికే బాలయ్య ఆ విషయాల్ని ప్రస్తావించారు.

    బాలయ్య 'గ్రేట్':

    బాలయ్య 'గ్రేట్':

    ఎదుగుదలను తలకెక్కించుకోలేదు కాబట్టే తమ హీరో 'పొట్టోడిని' అని చెప్పుకోవడానికి కూడా వెనకాడలేదని అభిమానులు చెబుతున్నారు.

    అందరి పొడుగు వ్యక్తుల మధ్య నేనే పొట్టి వ్యక్తిని అని ఓ హీరో ఒప్పుకోవడం ఆయన గొప్పతనం అంటున్నారు.

    రూ.50కోట్ల క్లబ్:

    రూ.50కోట్ల క్లబ్:

    జైసింహా సినిమా రూ.50కోట్ల క్లబ్ లో చేరినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో బాలయ్య సినిమా మాత్రమే కాస్త బెటర్ టాక్ తెచ్చుకుంది. ఈ వారం రిపబ్లిక్ డే, వీకెండ్ కూడా కలిసొస్తే జైసింహా మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ఒకవిధంగా సంక్రాంతి బరిలో ఇక బాలయ్య సినిమానే విజయం సాధించినట్లుగా చెప్పుకోవాలేమో!

    English summary
    Jai Simha, Nandamuri Balakrishna's 102nd movie was released as a Sankranti festive treat to Balayya fans. On Monday producers held a success meet in Hyd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X