Balakrishna on RAPO: రామ్ పోతినేని ఇప్పుడు నాకు ఛాలెంజ్ విసిరాడు: బాలయ్య

రామ్‌ పోతినేని, బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్కంద. రామ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా... సాయి మంజ్రెకర్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు ఆగస్టు 26వ తేదీన శిల్పా కళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంటుకు ప్రత్యేక అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. ఇక ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇక స్కంద ప్రీ రిలీజ్ ఈవెంటు ఘనంగా జరిగింది. ఈ ఈవెంటులో బాలకృష్ణ స్కంధ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంటు బాలకృష్ణ మాట్లాడుతూ... స్కంద అనే టైటిల్ కు నా శిరస్సు వచ్చి భక్తి భావం తెలియజేస్తున్నాను. మా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంధ చిత్రం మంచి సక్సెస్ ను అందుకోవాలి. ఇక్కడి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.

 Balakrishna Comments on Ram Pothineni at Skanda The Attacker pre realease event

మా కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ చేశాం. కొత్త నేపథ్యాల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యావాదాలు. తెలుగు సినిమాలు మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా పట్టం కడుతున్నారు. మా నాన్నగారి సినిమాలు కూడా చలన చిత్ర అభివృద్ధి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. తమ్ముడు రామ్ పోతినేని యాక్ట్ చేసి.. నాకు ఒక ఛాలెంజ్ వదిలారు. ఆయన తెలంగాణ నేపథ్యంలో ఓ సినిమా చేయడం... నేనూ భగవంత్ కేసరిలో తెలంగాణ యాసలోనే మాట్లాడనున్నానంటూ వెల్లడించారు.

నేను డిగ్రి చదివితే.. ఆయన పీహెచ్ డీ చేశాడు. యువతకు మెచ్చే సినిమాలు చేస్తున్నాడు రామ్. తమన్ గురించి చెప్పనక్కరలేదు. అఖండ చెప్పింది. బాక్సులు బద్దలైపోయాయి. ఇక్కడ ఒక తిక్కకు లెక్కలేని రామ్ పోతినేని... 2006లో దేవదాసు ఓపెనింగ్ కు వచ్చాను. ఇప్పుడు స్కంధ ప్రీ రిలీజ్ ఈవెంటు వచ్చాను. కళామాతల్లి ఇచ్చిన వరం రామ్ పోతినేని. ఇలాంటి ఎన్నో సినిమాలు చేయాలని.. అన్ని రకాల సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

ఇక శ్రీలీల.. అచ్చమైన తెలుగు హీరోయిన్. నేను ఆవిడతో చేస్తాను. ప్రతి సీన్ లో డెడికెషన్, తపన ఆమెలో ఉంది. ఇన్ని సినిమాలు చేస్తున్న ఆమెలో డెడికెషన్ సూపర్. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు గొప్ప నటులే. ఇక ఈ ఈవెంటుకు వచ్చిన అభిమానులు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలంటూ సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X