Don't Miss!
- Sports
Brett Lee Advice: కోహ్లీకి ఇంతకంటే మంచి టైం దొరకదు.. కచ్చితంగా ఈ టైం ఉపయోగించుకోవాలి
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రవితేజ డ్రగ్స్ కేసుపై బాలయ్య కామెంట్స్: అమ్మాయిల కోసమే అలా.. హీరోల గొడవపై ఊహించని విధంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలందరూ ఈ మధ్య కాలంలో ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అదే సమయంలో సినిమాల్లోనే కాకుండా.. కొత్త కొత్త అవతారాల్లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్య టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా హోస్టుగా పరిచయం అయ్యారు. అల్లు అరవింద్ స్థాపించిన ఆహా సంస్థ కోసం Unstoppable with NBK Show అనే షోను చేస్తున్నారు. ఇందులో తనదైన హోస్టింగ్‌తో అలరిస్తోన్న బాలయ్య.. అప్పుడే దీన్ని సూపర్ డూపర్ హిట్ చేసేశారు. ఈ క్రమంలోనే మాస్ మహారాజా రవితేజతోనూ వచ్చే ఎపిసోడ్లో సందడి చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో సంచలనం అయిన డ్రగ్స్ కేసు గురించి ఆయన కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ’తో భారీ హిట్ కొట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'అఖండ'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య భారీ హిట్‌ను కొట్టేశారు.
Bigg Boss Winner: వీజే సన్నీ కారు ధ్వంసం.. అస్వస్థతకు గురైన విన్నర్.. ఆలస్యంగా బయటకొచ్చిన న్యూస్

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్ట్
ఆరు పదుల వయసులోనూ ఉత్సాహంగా కనిపించే నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి వచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ నెలలో ఈ టాక్ షోను గ్రాండ్‌గా స్టార్ట్ చేసేసింది.

ఐదు ఎపిసోడ్స్ పూర్తి.. సూపర్ హిట్ షోగా
నటసింహా బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షో నుంచి ఇప్పటి వరకూ ఐదు ఎపిసోడ్స్ వచ్చాయి. మొదటి దాంట్లో మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో దానిలో నేచురల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాలుగో దానిలో అఖండ మూవీ యూనిట్, ఐదో ఎపిసోడ్లో రాజమౌళి, కీరవాణి వచ్చారు. ఇవన్నీ భారీ విజయం సాధించాయి.
Hamsa Nandini: క్యాన్సర్ బారిన పడిన టాలీవుడ్ హీరోయిన్.. సర్జరీలు జరిగినా కష్టమే.. పరిస్థితి దారుణం

బాలకృష్ణ షోలో రవితేజ, గోపీచంద్ రచ్చ
'Unstoppable with NBK' షోలో భాగంగా ఏడో ఎపిసోడ్ కోసం మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని గెస్టులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇటీవలే బయటకు వచ్చాయి. ఇందులో వీళ్లు ముగ్గురు ఆటపాటలతో అదరగొట్టినట్లు ఆ పిక్స్ చూస్తే అర్థం అవుతోంది. తాజాగా ఈ ప్రోమో విడుదలైంది. ఇది డిసెంబర్ 31న స్ట్రీమింగ్ కాబోతుంది.

గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన మాస్ హీరో
బాలయ్య హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' షో ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఆరంభంలోనే మాస్ మహారాజా రవితేజకు ఎలివేషన్ ఇచ్చి పిలిచాడు. ఇక, అతడు రావడం రావడమే బాలయ్య 'మనిద్దరి మధ్య గొడవ జరిగిందంట కదా. దీనికి క్లారిటీ ఇవ్వు' అని అడగ్గా 'అది పనీ పాట లేని డాష్ గాళ్లకు ఇదే పని' అంటూ రవితేజ బదులిచ్చాడు.
Bigg Boss: అమ్మ చెప్పినా షణ్ముఖ్‌ను అందుకే వదల్లేదు.. షోలో అలా బయట ఇలా అంటూ సిరి షాకింగ్‌గా!
అమ్మాయిల కోసం అలా వెళ్లేవాడివని
'Unstoppable with NBK' ప్రోమోలో రవితేజ సీక్రెట్స్‌ను బాలయ్య బటయ పెట్టేశారు. ఒక సందర్భంలో 'మొగల్రాజపురం అమ్మాయిలకు లైన్ వేసే వాడివి అంట కదా' అని అడిగారు. దీనికి రవితేజ 'వామ్మో ఇవన్నీ ఎలా తెలిశాయి' అంటూ సిగ్గుపడిపోయాడు. దీనికి బాలయ్య 'తప్పేముందయ్యా.. చిన్నప్పుడు మేము కూడా వేసేవాళ్లం బైక్ మీద వెళ్లి' అని చెప్పారు.

రవితేజ డ్రగ్స్ కేసుపై బాలయ్య కామెంట్
ఇక, ఈ ప్రోమోలో 'హెల్త్‌కు.. ఫిట్‌నెస్‌కు ఇంత వ్యాల్యూ ఇచ్చే నీ మీద.. డ్రగ్స్ కేసు పెట్టారు' అని రవితేజతో బాలకృష్ణ అన్నారు. దీనికి అతడు 'ఫస్ట్ దీనిపై నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్లు ఎక్కువగా పెంట పెంట చేసేశారు. దానికి ఎక్కువగా బాధ అనిపించింది' అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.