గొప్పగా పాడేశానని చెప్పడం లేదు.. శివ శంకరీ పాటపై బాలయ్య కామెంట్స్
నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీతో, బసవతారకం హాస్పిటల్ పిల్లలతో ఎంతో సందడిగా జరుపుకున్నాడు. అయితే ఈ వేడుకులన్నీ ఒకెత్తు అయితే.. BB3 మొదటి గర్జన, శివశంకరీ పాట ఓ రేంజ్‌లో వైరల్ అయింది. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఈ రెండు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చారు. అయితే ఈ రెంటిలో ఒకటి క్లిక్ అవ్వగా మరొకటి మిస్ ఫైర్ అయింది.

విమర్శల పాలైన శివశంకరీ..
నాటి క్లాసిక్ సాంగ్ శివశంకరీ పాటను బాలయ్య పాడాడు. ఇక ఈ పాట ఎంతగా విమర్శల పాలైందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరునికథలోని ఘంటసాల ఆలపించిన అద్భుత గీతాన్ని బాలయ్య బ్రష్టు పట్టించాడని కామెంట్స్ వచ్చాయి.

వర్మ సెటైర్స్..
ఇక ఏ విషయాన్ని అయినా తన శైలిలో స్పందిస్తాడు వర్మ. బాలయ్య గాత్రాన్ని సైతం ఓ రేంజ్‌లో ఏకిపారేశాడు. సంగీతం పుట్టినప్పటి నుంచి విన్న అతి గొప్ప పాట, గాత్రమని బాలయ్యను కించపరిచాడు. వర్మ ఇలా ఆడుకుంటే నాగబాబు మరో స్థాయిలో కామెంట్స్ చేశాడు.

శ్రుతి మించిన నాగబాబు..
నాగబాబు బాలయ్యను మరీ టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఓ ట్వీట్ చేసి.. అందులో హద్దులు దాటి విమర్శించాడు. ఆ ట్వీట్‌ను మళ్లీ డిలీట్ చేసి మరో ట్వీట్ వేశాడు. ‘ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా originals చాలా అద్భుతంగా ఉంటాయి.ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికె తెలిసుంటది' అని సుతిమెత్తంగా సెటైర్ వేశాడు.
Recommended Video

ఓ ప్రయత్నం చేశాను..
ఫేస్ బుక్ లైవ్‌లొకి వచ్చి అభిమానులతో ముచ్చటించిన బాలయ్య.. ‘నాకు స్ఫూర్తి ప్రదాత అయిన నాన్నగారు నటించిన `జగదేకవీరుని కథ` సినిమాలోని `శివశంకరీ` పాటంటే చాలా ఇష్టం. ఆ పాట పాడాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఎంతో సాధన చేశాను. నేను గొప్పగా పాడేశానని చెప్పడం లేదు. కానీ ఓ ప్రయత్నం చేశాను. నా సామర్థ్యం మేరకు ఆ పాట పాడాన'ని మాత్రం చెప్పగలని సెటైర్స్ వేసిన వారికి కౌంటర్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











