»   » గిన్నిస్ రికార్డ్ షార్ట్ ఫిల్మ్ మేకర్‌కు బాలయ్య అభినందన

గిన్నిస్ రికార్డ్ షార్ట్ ఫిల్మ్ మేకర్‌కు బాలయ్య అభినందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: లేపాక్షి డాక్యుమెంట‌రీ, ఛేంజ్ ల‌ఘు చిత్రంతో రెండు గిన్నీస్ వ‌రల్డ్ రికార్డులు సృష్టించిన హిందూపూర్ వాసి రాజేంద్ర‌వినోద్ ను ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెలయ్య బాలకృష్ణ అభినందించారు. చ‌దువులో రాణించ‌డంతో పాటు ల‌ఘు చిత్రాలు తీసి రెండు గిన్నీస్ వ‌రల్డ్ రికార్డుల‌తో పాటు అనేక అంత‌ర్జాతీయ అవార్డులు, రివార్డులు సాధించ‌డం రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణ‌ం అన్నారు.

రాజేంద్ర‌వినోద్ సాధించిన ఘ‌న‌త ప‌ట్ల వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో అభినంద‌న తీర్మానం ప్ర‌వేశ‌పెట్టి వినోద్ మరెన్నో ఉన్న‌త శిఖ‌రాలు చేరుకోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అన్ని విధాల స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాను అని బాలయ్య అన్నారు.

Balakrishna compliments on short film maker

బాలయ్య నటిస్తున్న తాజా సినిమా ‘డిక్టేటర్' వివరాల్లోకి వెళితే...ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మంచి మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శ్రీవాస్ ఈ చిత్రాన్ని బాలకృష్ణ అభిమానులు, ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశామని శ్రీవాస్ తెలిపారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రే్క్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ముగ్గురు కథానాయికల పాత్రలు సినిమాకి కీలంగా నిలుస్తాయని శ్రీవాస్ తెలిపారు.

‘'ఇది పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే చిత్రమవుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టయిలిష్ లుక్ తో కనపడతారు. ఈరోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది'' అని దర్శకుడు అంటున్నాడు.

రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

English summary
Tollywood star Balakrishna compliments on short film maker Rajendra Vinod.
Please Wait while comments are loading...