»   » 100వ సినిమా విషయంలో బాలయ్య అయోమయం!

100వ సినిమా విషయంలో బాలయ్య అయోమయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య ఇప్పటికే 99 సినిమాలు పూర్తి చేసారు. త్వరలో చేయబోయే 100వ సినిమా విషయంలో ఆయన ఇప్పటికీ ఓ నిర్ణయానికి రాలేక పోతున్నారని తెలుస్తోంది. బాలయ్య 100 సినిమా గురించి చాలా కాలంగా రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నా.... ఏ విషయాన్ని ఇప్పటి వరకు అఫీషియల్ గా ప్రకటించలేదు బాలయ్య.

గతంలో బాలయ్య 100వ సినిమా సింహా, లెజెండ్ లాంటి హిట్స్ అందించిన బోయాపాటి దర్శకత్వంలోనే ఉంటుందనే ప్రచారం ఉండేది. కొన్ని రోజులుగా పరిస్థితి మారింది. బాలయ్యతో గతంలో ‘ఆదిత్య 369' తీసిన సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో దానికి సీక్వెల్ గా ‘ఆదిత్య 999' సినిమా ఉంటుందనే ప్రచారం తెరపైకి వచ్చింది.

Balakrishna confusion about 100th film

అయితే బాలయ్య మాత్రం ఇప్పటి వరకు ఏ విషయం ప్రకటించలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య 100 సినిమా విషయంలో చాలా కన్ ఫ్యూజ్ అవుతున్నారని, అందుకే ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారని టాక్. సింగితం దర్శకత్వంలో చేయాలని బాలయ్యకు ఉన్నా.... ఆయన ఓల్డ్ డైరెక్ట్ కావడంతో ఈ జనరేషన్ ప్రేక్షకులను మెప్పిస్తాడో? లేదో? అనే సందిగ్ధంలో ఉన్నారట.

మరో వైపు బోయపాటి దర్శకత్వంలో చేయాలనుకున్నా.....100వ సినిమా కూడా రోటీ మాస్ మసాలాతో చేయడం కాకుండా డిఫరెంటుగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. 100 సినిమా మైల్ స్టోన్ సినిమా కావడంతో బాలయ్య ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారట. మరో వైపేమో బాలయ్య 100వ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. మరి వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

English summary
Nandamuri Balakrishna has already announced his 100th film in the direction of Singeetam Srinivas Rao but reports from filmnagar suggest that he is now in two minds about his milestone movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu