బాలకృష్ణతో చిరుకు చెక్?

By Staff

బాలయ్య బాబు టూర్‌ వల్ల చిరంజీవి టూరు ప్రభావాన్ని అధిగమించవచ్చు, లేదా సమాంతరం చేయవచ్చు. అప్పుడు ఇక పార్టీలకు సంబంధించిన పోరాటాలే ఉంటాయి తప్ప, గ్లామర్‌ పనిచేయదు. ఆరకంగా పీఆర్పీ వెనక్కి వెళుతుంది. చివరకు మళ్లీ మేము-కాంగ్రెసే బరిలో ఉంటా'మని టిడిపి ఎమ్మెల్యే ఒకరు బాలయ్య పర్యటన అంతరార్ధాన్ని వివరించారు.రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించిన బాలయ్యకు దానివల్ల వచ్చిన ఇమేజ్‌ను ఓటురూపంలో మలచుకునే కార్యక్రమానికి టిడిపి నాయకత్వం తెరలేపింది.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, షూటింగులకు విరామం ఇచ్చిన బాలకృష్ణ ,ఇక రానున్న మూడు నెలల కాలాన్ని పార్టీ ప్రచారానికే వెచ్చించనున్నారు. అందులో భాగంగా ఈనెల 29న సీమ ఉంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించను న్నారు. ఆ రోజు సాయంత్రం ఆయన హెలికాప్టర్‌ ద్వారా బెంగుళూరుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురం చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి వరసగా నాలుగురోజుల పాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తారు.

ప్రస్తుతం చిరంజీవి రాయలసీమ పర్యటనలోనే ఉన్నందున, ఆయన తిరిగిన ప్రాంతాల్లోనే పర్యటించడం ద్వారా జనాల మూడ్‌ను మార్చవచ్చన్నది టిడిపి వ్యూహం లా కనిపిస్తోంది. అందులోనూ ఇటీవలి కాలంలో తెలుగుదేశంని కూడా టార్గెట్‌ చేస్తూ, బాబుపై వ్యక్తిగత విమర్శలు సంధిస్తున్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవి దూకుడుకు చెక్‌ పెట్టడమే బాలకృష్ణ పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది. గతంలో అనంతపురంలో పర్యటించిన చిరంజీవికి జనం బ్రహ్మరధం పట్టిన వైనాన్ని దృష్టిలో ఉంచుకుని, బాలయ్య బహిరంగసభలకు భారీ జన సమీకరణ చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇంత వరకూ ఏ పార్టీ సభలకు రానంతమంది జనాలను సమీకరించే భారీ లక్ష్యంతో జిల్లా నేతలు పనిచేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X