ఎవడైనా నాకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాల్సిందే.. బాలయ్య కౌంటర్
టాలీవుడ్‌లో గతవారం నందమూరి బాలకృష్ణ, నాగబాబు మధ్య మాటల యుద్ధం విపరీతమైన చర్చకు దారి తీసింది. భూములు కొన్నారనే బాలకృష్ణ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే సృష్టించాయి. ఈ క్రమంలో బాలకృష్ణ మౌనం దాల్చడం వెనుక ఆంతర్యం అంతుబట్టలేదు. కానీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలనాత్మక రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలాంటి చర్చకు దారి తీస్తాయో అనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే..
Recommended Video

కుండ బద్దలు కొట్టినట్టు
ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాలకృష్ణ సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు. ఒకవేళ మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. ఇలాంటి క్రమంలో తెలుగు రాష్ట్రాల సీఎంలతో టాలీవుడ్ పెద్దలు సమావేశం కావడం, దానికి తనకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నాగబాబు నోరు అదుపులోకి పెట్టుకోమని బాలయ్యకు వార్నింగ్ ఇవ్వడం సెన్సేషనల్‌గా మారింది.

వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా
అయితే తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను చాలా ఉత్సాహంగా వ్యక్తం చేశారు. తనకు తన తండ్రి ఎన్టీఆర్ స్పూర్తిదాయకం అని చెప్పారు. అన్ని విషయాల్లోనూ తన తండ్రిని అనుసరిస్తానని చెప్పారు. తన తండ్రి చుట్ట తాగేవాడు.. నేను ఒక దశలో నేను చుట్ట తాగే వాడిని అంటూ చెప్పారు.

బోయపాటి శ్రీను సినిమా గురించి
ఇక బాలకృష్ణ తన తదుపరి చిత్రం బోయపాటి సినిమా గురించి వివరించారు. బోయపాటి శ్రీను సినిమా అంటే ఫైటింగ్‌తోనే మొదలపెట్టడం జరుగుతుంది. మంచి జోష్‌తో సీన్లు చిత్రీకరించాం. లాక్‌డౌన్ కాబట్టి సినిమా షూటింగ్ ఆగిపోయింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెడుతాం అని బాలకృష్ణ చెప్పారు.

అన్యాయం జరిగితే..
ఇక ఇటీవల జరిగిన గొడవపై స్పందిస్తూ.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాను. ఎవడైనా నాకు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. నా గురించి నేను ఎప్పుడు భయపడను. వ్యక్తిగతం నాకు భయం లేదు. నాకు వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బాలయ్య ఫైర్ అయ్యాడు.

చరిత్ర రాయాలన్నా.. తిరగరాయాలన్న మేమే
ప్రతీసారి ఒక విషయాన్ని చెబుతుంటాను. ఇప్పుడు కూడా అదే వెల్లడిస్తున్నాను. తెలుగు ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించాలన్నా మేమే, తిరగరాయాలన్నా మేమే.. మా వంశానికి ఆ క్రెడిట్ ఉంది. మా వంశాన్ని ఎవరైనా ఫాలో కావాల్సిందే అంటూ బాలకృష్ణ ఆవేశంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ త్వరలోనే బయటకు రానున్నది. ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ఘాటుగా ఘాటుగా ఉన్నట్టు కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











