చిరంజీవికి బాలయ్య చురక

మేం సిన్మాల్లో నటిస్తున్నా 1982 టీడీపీ ఆవిర్భావం నుంచీ ప్రజాసేవలో ఉన్నాం. నాన్నగారు పేదల బాధలను అధ్యయనం చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన చేయగలిగినంతా చేశారు. ఆయన వారసత్వంగా మేమూ ప్రజాసేవలో పునీతులమవుతున్నాం. కేవలం రాజకీయాల కోసమే వచ్చిన నటుల్ని మాత్రం జనం నమ్మే పరిస్థితులు లేవు..వచ్చే ఎన్నికలలో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయేనని బాలయ్య పునరుద్ఘాటించారు.
సినిమా షూటింగ్ సందర్భంగా నాలుగు రోజులపాటు టీడీపీ కార్యకర్తలు, నేతల నుంచి తెలుసుకున్న విషయాలను అధ్యయనంచేసి గోదావరి జిల్లాలలో టీడీపీ పార్టీ పరిస్థితిని అధిష్ఠానానికి తెలియజేస్తానన్నారు.అలాగే ఆయన ఇంట్లో జరిగిన కాల్పుల కేసు గురించి ప్రశ్నిస్తే కింది కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.


Click it and Unblock the Notifications











