పర్చూరులో బాలకృష్ణ కటౌట్ కత్తిరింపు ఉదంతం ఇంకా మరవకముందే ఒంగోలులోను సీన్ రిపీట్ అయింది. పర్చూరులో కత్తిరించినట్టుగానే ఒంగోలులోనూ ఒక్కమగాడు సినిమా కటౌట్ లో బాలకృష్ణ తలభాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. ఈ సంఘటనతో ఒంగోలు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలకృష్ణ అభిమానులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనకు దిగారు. ఇలాంటి చర్యలకు పాల్పడి రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదని వారి సందర్భంగా హెచ్చరించారు. మంచి పనులు చేసి ఆకట్టుకోవాలే గానీ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఒంగోలు బాలకృష్ణ అభిమాన సంఘం ప్రతినిధులు అంటున్నారు.
Story first published: Saturday, May 16, 2026, 18:29 [IST]