అదిరింది: హీరోయిన్‌తో స్టెప్పులేసిన బాలయ్య (ఫోటోస్)
హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు నిధుల సేకరణలో భాగంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కలిసి ఇటీవల ‘మేముసైతం' పేరుతో భారీ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి ముందు రోజు ‘డిన్నర్ విత్ స్టార్స్' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో నందమూరి నటసింహం బాలయ్య....లెజెండ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ కలిసి ర్యాంపు వాక్ చేయడంతో పాటు డాన్స్ చేసి సందడి చేసారు. బాలయ్య డాన్స్ చేస్తుంటే ప్రాంగణమంతా చప్పట్లు, విజిల్స్, కేకలతో అదగొట్టారు అభిమానులు. అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి...
లెజెండ్ చిత్రంలో ఐటం సాంగు చేసిన హంసా నందిని కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్లైడ్ షోలో బాలయ్య, సోనాల్ చౌహాన్ ఫోటోలు....

స్టెప్పులేసిన బాలయ్య
నవంబర్ 29న జరిగిన డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ స్టెప్పులేస్తున్న దృశ్యం.

లెజెండ్ హీరోయిన్
బాలయ్యతో కలిసి లెజెండ్ చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్ ఈ కార్యక్రమంలో బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది.

ఫోజులు..
ఈ సందర్భంగా బాలయ్య ఇలా ఫోటోలకు స్టైల్‌గా ఫోజులు ఇచ్చారు.

నారీ నారీ నడుమ మురారీ
లెజెండ్ మూవీ హాట్ బ్యూటీస్ ఇద్దరితో కలిసి బాలయ్య ఇలా నారీ నారా నడుమ మురారిలా ఫోజులు ఇచ్చారు.

అదిరిందయ్యా..
బాలయ్య పెర్ఫార్మెన్స్ అదిరిందంటూ ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.

రూ. లక్ష
డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి టికెట్ ధర రూ.లక్షగా నిర్ణయించారు. చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సందడిగా
డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమం మొత్తం సందడిగా సాగింది.


Click it and Unblock the Notifications











