బాలకృష్ణ రెండో కుమార్తె వివాహ పత్రిక ఇదే(పోటో పీచర్)

By Srikanya

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ నెల 21న జరగనుంది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడైన శ్రీభరత్‌తో తేజస్విని వివాహ నిశ్చితార్థం బాలయ్య ఇంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 21వ తేదీ ఉదయం 8:52 గంటలకు వివాహం జరపనున్నారు.

ఆదివారం బాలకృష్ణ నివాసంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది. శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న హరికృష్ణ హాజరు కాలేదు.

బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణి. విదేశాల్లో స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ, సాంతాక్లారా లాంటి ప్రఖ్యాత యూనివర్శిటీల్లో ఉన్నత చదువులు చదివి మంచి ప్రతిభ గల వ్యక్తిగా పేరు తెచ్చుకుంది. ఆమె వివాహం నారా లోకేష్‌తో జరిగింది. ఇక తేజస్విని కుటుంబంతో పాటు అటు వరుడు భరత్ కుటుంబం కూడా సామాజికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కాబట్టి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది.

మంచి కుటుంబం

మంచి కుటుంబం

పెళ్లి కుమారుడు...గీతం గ్రూఫ్(GITAM-Gandhi Institute of Technology and Management) అధినేత ఎంవీవీఎస్ మూర్తి పెద్ద కుమారుడు రామారావు తనయుడు శ్రీ‌భరత్‌తో తేజస్విని వివాహం జరుగనుంది.

రెండు కుటుంబాలూ..

రెండు కుటుంబాలూ..

చంద్రబాబే దగ్గరుండి ఈ సంభదం కుదిర్చారు. రాజకీయంగానే కాక సంప్రదాయపరంగానూ రెండు కుటుంబాలు పద్దతి కలవని, అందుకే వీరు కలవటం మంచిదని ఆయన భావించి ఈ వివాహం నిర్ణయించినట్లు చెప్తున్నారు.

సినీ,రాజకీయ పెద్దలు,,

సినీ,రాజకీయ పెద్దలు,,

ఈ వివాహానికి సినీ,రాజకీయ పెద్దలంతా హాజరవుతున్నారు. ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్స్ పంపటం జరిగింది. చంద్రబాబు స్వయంగా కొందరికి తెలియచేయగా, బాలకృష్ణ సినిమా వారందరికీ పర్శనల్ గా కలిసి వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఘనంగా వివాహం

ఘనంగా వివాహం

ఈ వివాహాన్ని బాలకృష్ణ చాలా ఘనంగా చేయనున్నారు. ఎక్కడా వంకపెట్టలేని విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన తన ముద్దుల కూతురు వివాహాన్ని భారీ స్ధాయిలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.

బాలయ్య ఫ్యాన్స్...

బాలయ్య ఫ్యాన్స్...

ఈ వివాహానికి భారీగా బాలకృష్ణ,నందమూరి కుటుంబ అభిమానులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారు ప్రిపరేషన్స్ లో ఉన్నారు. అభిమాన సంఘాల వారికి కూడా ఇన్విటేషన్స్ పంపినట్లు వినికిడి. వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారా..తర్వాత విందు ఏర్పాటు చేస్తారా అనేది తెలియరాలేదు.

పూర్తి సంప్రదాయంగా...

పూర్తి సంప్రదాయంగా...

ఇక ఈ వివాహం ఇరు వైపు పెద్దల అంగీకారంతో పూర్తి సంప్రదాయబద్దంగా జరగనుంది. బాలకృష్ణ స్వయంగా ఈ పెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఈ వివాహం కుదిరిన దగ్గరనుంచి చాలా ఉత్సాహంగా ఉన్నారు.

నందమూరి ఫ్యామిలీ...

నందమూరి ఫ్యామిలీ...

ఈ వివాహానికి నందమూరి కుటుంబం మొత్తం హాజరవుతున్నారు. తమ ఇంట్లో పెళ్లిని వారంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బాలకృష్ణ తో వారందకి పూర్తి ప్రేమానుభందం ఉండటంతో ఏ అమరికలు లేకుండా వస్తున్నారు.

సినీ రంగం తరలి వస్తోంది...

సినీ రంగం తరలి వస్తోంది...

బాలకృష్ణ కు మొదటి నుంచి ఏ కాంట్రావర్శి లేని ఆర్టిస్టు కావటంతో అన్ని వర్గాల్లో అభిమానం ఉంది. దాంతో 24 క్రాప్ట్ లకు చెందిన ముఖ్యులంతా ఈ వివాహానికి హాజరవుతున్నారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి కూడా కొందరు హీరోలు ఈ వివాహానికి హాజరు అవుతున్నారు. ఇక ఆయనతో పనిచేసిన దర్శకులు సైతం ఈ వివాహాన్ని తమ ఇంట్లో వివాహంగా భావించి తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ

ఇక నందమూరి బాలకృష్ణ ప్రముఖ తెలుగు సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు. ఆయన భార్య పేరు వసుంధరదేవి. వీరికి ముగ్గురు సంతానం. కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు మోక్షజ్ఞ. బాలయ్య అప్పటి తమిళనాడు రాజధాని మద్రాసులో జన్మించారు. ఆయన బాల్యమంతా అక్కడే సాగింది. గతంలో మద్రాసు కేంద్రంగా తెలుగు సినిమా కార్యకలాపాలు జరిగేవి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రముఖులంతా అప్పట్లో మద్రాసులోనే నివాసం ఏర్పరుచుకున్నారు.

ధట్స్ తెలుగు శుభాకాంక్షలు

ధట్స్ తెలుగు శుభాకాంక్షలు

ఈ సందర్భంగా త్వరలో ఒకటి కాబోతున్న వీరికి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఈ వివాహానికి చెందిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X