Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పారిశ్రామికవేత్తతో బాలయ్య రెండో కూతురు పెళ్లి?
దాసరి నారాయణ రావు దర్శకత్వం వహిస్తున్న పరమవీర చక్ర సినిమా షూటింగులో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. చాలా రిస్కీ షాట్స్ కూడా బాలయ్య చేస్తున్నాడని దాసరి నారాయణ రావు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో తన రెండో కూతురు తేజస్వినికి బాలయ్య సంబంధాలు వెతుకున్నారని సమాచారం. తెలుగు యువహీరోలతో పాటు చాలా మంది తేజస్వినిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారట. అయితే ఓ యువ పారిశ్రామికవేత్తపై బాలయ్య దృష్టి పడిందని అంటున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆ యువ పారిశ్రామికవేత్తకు హైదరాబాదులో, హైదరాబాదు పరిసరాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయట. అతనితో పెళ్లికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. బాలయ్య ప్రథమ పుత్రిక బ్రాహ్మణి వివాహం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్ తో జరిగిన విషయం తెలిసిందే.