బాలకృష్ణ కూతురు వివాహ వేడుక (ఫోటోలు- 1)

By Srikanya

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ ఉదయం (ఆగస్టు 21)న అంగ రంగ వైభోగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఈ వేడుక చోటు చేసుకుంది. అత్యంత సుందరంగా అలంకరించిన కళ్యాణ మండపంలో ఈ వివాహం జరుగుతోంది. బాలకృష్ణ స్వయంగా అతిధులను ఆహ్వానిస్తున్నారు.

సినీ, రాజకీయ రంగ ప్రముఖులంతా ఈ వివాహానికి హాజరయ్యి...వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. బాలకృష్ణ తన దైన శైలిలో అందరినీ పలకరిస్తూ వివాహ వేడుకను అందంగా,ఆనందంగా జరిగేలా పర్యవేక్షిస్తూ పాల్గొంటున్నారు.

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడైన శ్రీభరత్‌తో తేజస్విని వివాహ జరుగబోతోంది. నిశ్చితార్థం ఇటీవల బాలయ్య ఇంట్లో జరగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల ఈ రోజు ఉదయం 8:52 గంటలకు ముహూర్తం.

వేడుక ఫోటోలు..స్లైడ్ షో లో...

స్వయంగా..

స్వయంగా..

ఈ వివాహం కోసం గత నెల రోజులుగా గ్రాండ్ గా ఏర్పాట్లు చేసారు. బాలకృష్ణ పర్యవేక్షణలో సంప్రదాయం,ఆధునికత కలగిసేలా ఈ వేడుక ని డిజైన్ చేసారు. నందమూరి వారి ఇంట వివాహం కావటంతో ఎక్కడెక్కడి వారు వస్తారని,అందుకు తగిన విధంగా కళ్యాణ మండపం ముస్తాబు చేసారు.

ఆనందం సాయి...

ఆనందం సాయి...


ఎన్నో భారీ చిత్రాలకు అత్యధ్బుతమైన సెట్స్ వేయటంలో అనుభవమున్న ఆనందసాయి.. ఈ వివాహానికి మండపం రెడీ చేసారు. గతంలో ఆనంద సాయి...రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వివాహాలకు సెట్స్ డిజైన్ చేసారు.

ప్రత్యేకంగా..

ప్రత్యేకంగా..

ఈ మండపం నమూనాని బాలయ్య రకరకాల డిజైన్స్ పరిశీలించి పైనల్ గా... దీనికి ఫిక్సై డిజైన్ చేయించుకున్నారని, స్వర్ణ వర్ణంతో ఉండబోయే ఈ మండపం..నీలం రంగు లైటింగ్ తో ఉంది. ఈ కళ్యాణ మండపం ప్రత్యేకంగా అతిధులను అలరిస్తోంది.

బ్యాంకాక్ పువ్వులతో...

బ్యాంకాక్ పువ్వులతో...

అలంకరణ కోసం బ్యాంకాక్‌ నుంచి ప్రత్యేకంగా పువ్వుల్ని తెప్పించారు. ఈ వేడుక కోసం సినీ కళాదర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో కల్యాణ మండపాన్ని తీర్చిదిద్దారు. ఈ పువ్వులు తమ దైన శోభతో అతిధులను ఆకట్టుకుంటున్నాయి.

సంప్రదాయం..

సంప్రదాయం..

తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. మొదటి నుంచి బాలకృష్ణ సంప్రదాయానికి పెద్ద పీట వేసే వ్యక్తి. తన తండ్రి బాటలోనే తెలుగుదనం ఉట్టిపడిలా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు

నందమూరి వారు...

నందమూరి వారు...

నందమూరి కుటుంబ సభ్యులంతా వేదికపై కూర్చునేలా పెద్ద మండపాన్ని సిద్ధం చేశారు. ఈ వివాహానికి నందమూరి కుటుంబానికి చెందిన అన్నదమ్ములు,అక్క చెల్లెళ్లు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. తమ ఇంట వేడుకగా అంతా భావించి చేస్తున్నారు.

అభిమామానులకు..

అభిమామానులకు..

బాలకృష్ణ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. అందులోనూ నందమూరి వంశాభిమానులు అంతా ఈ వివాహం దగ్గరుండి చూడాలని ముచ్చటపడుతున్నారు. ఈ నేపద్యంలో ... ప్రముఖులు, అభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు.

ఎల్‌ఈడీ తెరలను ..

ఎల్‌ఈడీ తెరలను ..

ఈ వివాహంలో టెక్నాలిజీ కూడా ప్రధాన పాత్ర పోషించనుంది. పెళ్లి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మండపం చుట్టూ ఎల్‌ఈడీ తెరలను సిద్ధం చేశారు. మండపానికి దూరంగా ఉన్నవారు సైతం ఈ వివాహాన్ని ఇబ్బంది పడకుండా చూడాలని ఈ ఏర్పాట్లు.

ప్రత్యేక లైటింగ్...

ప్రత్యేక లైటింగ్...

పగటి పూట పెళ్లి కావడంతో లైటింగ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎరుపు, తెలుపు, పర్పుల్‌ రంగుల మేళవింపుతో అలంకరణ చేశారు. మరోకల్‌ డిజైనింగ్‌లో మండపాన్ని తీర్చిదిద్దారు. ఇలా చేయటంతో కళ్యాణ మండపం ప్రత్యేకమైన శోభతో మెరిసిపోతోంది.

కష్టం...

కష్టం...

పెద్ద వారి ఇళ్లల్లో పెళ్లి అంటే కల్యాణ మండపాలు డిజైన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ కళ్యాణ మండపం...18 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసారు. సుమారు మూడు టన్నుల బరువు ఉంటుంది. ఈ మండప నిర్మాణం కోసం 300 మంది వారంరోజుల పాటు పని చేశారు.

లిప్ట్ లు...

లిప్ట్ లు...

వివాహానికి సంభందించిన ప్రతీ విషయంలోనూ ముందు చూపుతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసారు. వివాహానంతరం నూతన దంపతులను అభిమానులకు పరిచయం చేసేందుకు అభిమానుల గ్యాలరీకి చేరడానికి ప్రత్యేకమైన లిఫ్టును ఏర్పాటు చేశారు.

ఓ రేంజిలో..

ఓ రేంజిలో..

ఈ ఏర్పాట్లు చూసిన వారు...బాలకృష్ణ కూతురు వివాహం అందరూ పది కాలాలు పాటు చెప్పుకునేలా జరుగుతోందని అంటున్నారు. రెండు పెద్ద కుటుంబాలు ఈ సందర్బంగా ఏకం కావటంతో ఓ రేంజిలో ధూమ్...ధామ్ గా వివాహం జరుగుతోంది.

కళ్యాణం- కమనీయం

కళ్యాణం- కమనీయం

వేదికపై పెళ్లి కొడుకు- కూతురుని చూసిన వారు ముచ్చటైన జంట అని ప్రశంసిస్తున్నారు. అదే విషయం బాలయ్య కి చెప్తూండటంతో ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఈ వివాహం...బాలకృష్ణ బంధువర్గమే కాకుండా...ఆయన సన్నిహితులకూ పండుగ గా మారింది.

పండుగ...

పండుగ...

ఈ వివాహ వేడుక వద్ద అంతటా పండుగ వాతావరణం నెలకొని ఉంది. బాలకృష్ణ ముఖంలో ఆనందం తాండవిస్తోంది. తన ముద్దుల కూతురు వివాహం తను అనుకున్న రీతిలో గ్రాండ్ గా జరుగుతూండంటంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు.

విషెష్...

విషెష్...

ఈ వివాహ సందర్భంగా వధూ,వరులకు, బాలకృష్ణకు ...ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X