పెళ్ళి తంతు :పెళ్లి కొడుకుతో మోక్షజ్ఞ(ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్‌: సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, భరత్‌ల వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానుల రాకతో సందడి నెలకొంది. భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది.

వివాహ వేడుకకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, భాజపా నేత బండారు దత్తాత్రేయ, సినీనటులు మోహన్‌బాబు, మురళీమోహన్‌, పరుచూరి బ్రదర్స్‌, జయసుధ, రాఘవేంద్రరావు, రామానాయుడు తదితరులు హాజరయ్యారు.

పెళ్లి కార్యక్రమాన్ని అన్ని వార్తా చానళ్లు, ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లలో ప్రసారమయ్యే వీలుగా ఉదయం నుంచి పెళ్లి మండపంలోని కార్యక్రమాలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి ప్రత్యక్ష ప్రసారంగా ఆయా చానళ్ల ప్రతినిధులకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ధట్స్ తెలుగు వధూ వరులకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


ఫోటోలు...స్లైడ్ షోలో...

మల్లెపూల శాలువా...

మల్లెపూల శాలువా...

పెళ్లికొడుకుకి బాలకృష్ణ ..మల్లెపూల శాలువా కప్పి సత్కరిస్తున్నారు. ఈ ముచ్చట చూసేవారందిరిలో ఆనందం నింపింది.

కావూరి,బాలయ్య...

కావూరి,బాలయ్య...

పెళ్లి కొడుకుతో తాత కావూరి సాంబశివరావు, ఎదురుగా పిల్లనిచ్చిన మామ..బాలకృష్ణ, ప్రక్కన బావ మరిది (బాలకృష్ణ తనయుడు) ఉన్నారు.

కొబ్బరి బొండాంతో..

కొబ్బరి బొండాంతో..

అచ్చ తెలుగు సంప్రదాయంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకలో పెళ్లి కొడుకు ఇలా ...కొబ్బరిబొండాంతో వివాహ వేదిక దగ్గరకు వచ్చారు.

ఆత్మీయంగా...

ఆత్మీయంగా...

బాలకృష్ణ వివాహానికి హాజరైన మగపెళ్లి వారిని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ, వివాహాన్ని ఘనంగా జరిపించారు.

ముచ్చట్లు...

ముచ్చట్లు...

పెళ్లికొడుకు ఈ వివాహ వేడుకలలో తన స్నేహితులతో బంధువులతో ఇలా ఉత్సాహంగా ముచ్చటిస్తూ...కనపడ్డారు.

కాళ్లు కడగటం...

కాళ్లు కడగటం...

బావ మరిది...మోక్షజ్ఞ ఇలా తన బావ కాళ్లు కడిగి..తన సోదరిని వివాహం చేసుకోమని అడిగే...సంప్రదాయం...లో ..

ఉత్సాహం...

ఉత్సాహం...

ఈ వేడక తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. మొదటి నుంచి బాలకృష్ణ సంప్రదాయానికి పెద్ద పీట వేసే వ్యక్తి. తన తండ్రి బాటలోనే తెలుగుదనం ఉట్టిపడిలా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు.

పూర్తయ్యాక...

పూర్తయ్యాక...

ఈ కాళ్లు కడిగే తంతు పూర్తయ్యాక..ఇలా బావ,బావ మరుదులిద్దరూ సరదాగా...

రెడీ...

రెడీ...


పెళ్లికు ముందు ...సంప్రదాయంగా జరిగే ఈ తంతుని పురోహితుల సమక్షంలో చాలా పద్దతిగా జరిపారు.

కాళ్లు తుడవటం..

కాళ్లు తుడవటం..

బావమరిది మోక్షజ్ఞ ఇలా తన బావ కాళ్లు కడిగి ...టవల్ తో తుడుస్తున్నారు. ప్రతీది పద్దతి ప్రకారం జరగాలని బాలకృష్ణ ఉద్దేశ్యం.

ఆకుపై కాళ్లు...

ఆకుపై కాళ్లు...

పెళ్లి కొడుకు కాళ్లు కడిగే ముందు ఇలా ఆకుపై కాలు పెట్టించి దాన్ని కడిగి, తర్వాత తుడవటం ఆచారం..

ఇదో అందం...

ఇదో అందం...

సంప్రదాయంగా జరుగుతున్న వివాహం కావటంతో అందరూ చాలా ఆసక్తిగా ఈ వివాహంలో జరిగే తంతుని గమనిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X