twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణను గూగుల్ తల్లి చంపేసింది.. దారుణంగా డేత్ డేట్.. తప్పు ఎలా జరిగిందంటే..

    |

    Recommended Video

    Google Shows Mistake In Balakrishna's Biography

    ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో పొరపాట్లు జరగడం సాధారణంగా మారింది. ఇక వెబ్ పబ్లిషింగ్‌లో కంటెంట్ మీద నియంత్రణ కోల్పోవడంలో ఆశ్చర్యం కనిపించడం లేదు. ఇంటర్నెట్‌లో ఎలాంటి పొరపాటైన జరుగవచ్చు అనే సంఘటనకు ఉదాహరణగా బాలకృష్ణ వికీపీడియా పేజ్ నిలిచింది. బాలకృష్ణ మరణించారంటూ చూపిస్తున్న విధానం గూగుల్ లోపాలకు నిదర్శనంగా మారింది. ఎందుకు ఏం జరిగిందంటే..

    బాలయ్య కాళ్ళు మొక్కుతున్న నిరుపేద.. ఫోటో వైరల్, మళ్ళీ హాట్ టాపిక్.. కారణం ఇదే!బాలయ్య కాళ్ళు మొక్కుతున్న నిరుపేద.. ఫోటో వైరల్, మళ్ళీ హాట్ టాపిక్.. కారణం ఇదే!

    బాలయ్య చనిపోయినట్టు

    బాలయ్య చనిపోయినట్టు

    గూగుల్‌లో బాలకృష్ణ పేరుతో ఉన్న వికీపీడియా పేజ్‌ను చూడగా.. అన్ని వివరాలు చాలా పక్కగా రాశారు. కానీ బతికి ఉండగానే బాలయ్య బాబు చనిపోయినట్టు చూపించడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

     1995లోనే మరణించినట్టు

    1995లోనే మరణించినట్టు

    బాలకృష్ణ గురించి అన్ని వ్యక్తిగత వివరాలు బాగానే పొందుపరిచారు. నవంబర్ 2, 1913లో జన్మించినట్టు రాశారు. దానికిందనే 1995లో జూలై 19న బెంగళూరులో మరణించినట్టు వెల్లడించారు. ఇది గ్రహించిన అభిమానులు తప్పును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

     వైరల్‌గా బాలయ్య డెత్ డేట్

    వైరల్‌గా బాలయ్య డెత్ డేట్

    బాలకృష్ణ మరణ తేదీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాట్సప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. తీరా ఆరా తీయగా కన్నడ నటుడు టీఎన్ బాలకృష్ణ వివరాలను నందమూరి బాలకృష్ణకు జతచేయడంతో భారీ తప్పిదం దొర్లింది.

    బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగ్రహం

    బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగ్రహం

    బతికి ఉండగానే బాలకృష్ణ మరణించినట్టు చూపిస్తున్న వివరాలపై బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ భాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్ పేరును కౌశల్ బాబు అని, రాశీఖన్నాకు పెళ్లైనట్టు చూపించిన దాఖలాలు ఉన్నాయి.

    English summary
    Nandamuri Balakrishna, also known as NBK or simply Balakrishna, is an Indian film actor and politician known for his works predominantly in Telugu cinema. He is the sixth son of Telugu film actor and former Chief Minister of Andhra Pradesh N. T. Rama Rao. Google has given wrongly his death date become viral in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X