»   » ఫ్యాన్స్ కు పండుగ: ధోతి,కండువాతో బాలకృష్ణ (ఫోటో)

ఫ్యాన్స్ కు పండుగ: ధోతి,కండువాతో బాలకృష్ణ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగుతనం ఉట్టిపడే వేష ధారణతో బాలకృష్ణ కనిపిస్తూ తన అభిమానులను ఆనందింప చేస్తున్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావు..తెలుగుతనం అంటే ఎలా ఉంటుందో ప్రపంచ దేశాలకు తన కట్టు బొట్టు,మాట తీరుతో చెప్పి జేజేలు అందుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్లు ఈ గెటప్ లోకనిపించి కనువిందు చేస్తున్నారు. త్వరలో తెలుగు దేశం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన ఇలా పార్టీ కార్యక్రమాలు హాజరు కానున్నారని అంతర్గత వర్గాల సమాచారం.

ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'లెజండ్' . ప్రస్తుతం దుబాయి లో షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం వెనక ఓ రహస్యమైన ఎజెండా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో,పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ చిత్రం అసలు ఉద్దేశ్యం ఎలక్షన్ సమయంలో తెలుగు దేశం శ్రేణులను ఉత్తేజపరచమే అని చెప్పుతున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ చేత చెప్పించే డైలాగులు...పార్టీ ప్రచారానికి ఉపయోగపడేలా ప్లాన్ చేసారని అంటున్నారు. బాలకృష్ణ ఈ సారి ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తారని అందుకే ఈ 'లెజండ్' అవతారం అంటున్నారు. ఇందులో మాస్ లీడర్ గా ఆయన కనపడటం వెనక ఉద్దేశ్యం అదేనని అంటున్నారు.

పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను. దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని బాలయ్య రాజకీయ భవిష్యత్‌కు ఉపకరించేలా రూపొందిస్తున్నాడట. బాలయ్య అభిమానులను, తెలుగు దేశం పార్టీలను అలరించేలా సినిమాలో డైలాగులు ఉంటాయని, కొన్ని సన్నివేశాలు కూడా బాలయ్య అభిమానుల్లో జోష్ నింపే విధంగా ఉంటాయని చెప్పుకుంటున్నారు.

'సింహా'వతారంలో బాలకృష్ణ ఎలా ఉంటారో ఇదివరకే చూపించారు బోయపాటి శ్రీను. చూడూ ఒక వైపే చూడూ... అంటూ బాలకృష్ణ గర్జించారు. అది అభిమానులకు భలే నచ్చింది. అందుకే ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ కలయికలో రెండో చిత్రం రూపొందుతోంది. అదే... 'లెజెండ్‌'. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14రీల్స్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో విషయానికి వస్తే... ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ సాగుతోంది. హీరో,హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, యాక్షన్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు రకాల పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఇందులో బాలకృష్ణ నటన అందరినీ అలరిస్తుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

English summary

 Here is the latest picture of Balakrishna in a dhoti-clad avatar which could be a best example for how it should be used.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X