వార్నింగ్ లతో... : బాలయ్య 'డిక్టేటర్‌' టీజర్ (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : . 'నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉంది. మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి వాళ్లన్ని రెచ్చగొట్టడం నీ జీవితానికే ప్రమాదకరం' అంటూ విలన్స్ కు వార్నింగ్ లు ఇస్తూ బాలకృష్ణ వచ్చేసారు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'డిక్టేటర్' టీజర్ ను ఈ రోజు (శుక్రవారం) రిలీజ్ చేశారు. ఆ టీజర్ ని ఇక్కడ చూడండి.

మొదటి నుంచి చెపుతున్నట్టుగానే శ్రీవాస్ ఈ సారి బాలకృష్ణను ఫుల్ స్టైలిష్ గా చూపించాడు. బాలయ్య అభిమానులు కోరుకునే పంచ్ డైలాగ్ లను టీజర్ లోనే చూపించి ఆకట్టుకున్నాడు శ్రీవాస్ బాలయ్య చెప్పిన డైలాగ్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

లక్ష్యం,లౌక్యం చిత్రాల హిట్ దర్శకుడు శ్రీవాస్‌ తాజాగా డైరక్ట్ చేస్తున్న త్రం 'డిక్టేటర్‌'. నందమూరి బాలకృష్ణ హీరో. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. వేదాశ్వ క్రియేషన్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ రూపొందిస్తున్నాయి. 'డిక్టేటర్‌'లో దాదాపు సగభాగం యూరప్‌ నేపథ్యంలోనే సాగుతుంది. పాటలూ, పోరాట ఘట్టాలనీ అక్కడే తెరకెక్కించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Balakrishna Dictator Movie Teaser Released

చిత్రంలో బాలకృష్ణ పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ... అతని మాటెప్పుడూ బాణంలా దూసుకుపోతుంది. అది చట్టంలా నిలిచిపోతుంది. శాసనంగా మిగిలిపోతుంది. అతడే.. 'డిక్టేటర్‌'. నీతి తప్పిన సమాజానికి నియంతలా మారిన అసలు సిసలైన నాయకుణ్ని మా సినిమాలో చూడండి అంటున్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంది''అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ '''డిక్టేటర్‌' పేరులో ఎంత శక్తి ఉందో అంతే శక్తి బాలకృష్ణ పాత్రలోనూ ఉంటుంది. ఆయన్ని చాలా స్త్టెలిష్‌గా, అభిమానులు మెచ్చేలా చూపించబోతున్నా''మన్నారు. అలాగే... ''విభిన్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. భావోద్వేగాలు, యాక్షన్‌, వినోదం సమపాళ్లల్లో కుదిరాయి. బాలకృష్ణ తెరపై స్త్టెలిష్‌ పాత్రలో కనిపించబోతున్నార''న్నారు.

Balakrishna Dictator Movie Teaser Released

ఎరోస్‌ ఎండీ సునీల్‌ లుల్లా మాట్లాడుతూ ''తెలుగు నుంచి మంచి సినిమాలొస్తున్న తరుణంలో మా సంస్థ పరిశ్రమలో భాగం కావడం ఆనందంగా ఉంది. 'డిక్టేటర్‌' అందరినీ మెప్పించే సినిమా అవుతుంది. బాలకృష్ణ సినిమా ప్రయాణంలో మరిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది'' అన్నారు.

తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.

ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X