ఈ వయసులోనూ రిస్క్ చేస్తున్న బాలయ్య
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బాలయ్య సరసన త్రిష కథనాయికగా నటిస్తోంది. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సమక్షంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సీన్స్ లో బాలయ్య డూప్ లేకుండా...చాలా రీస్కీ ఫైట్స్ చేస్తున్నారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రంపచోడవరం, మారెడుపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి చేసిన షెడ్యూల్ చాలా బాగా వచ్చిందని, ఈ షెడ్యూల్ తెరకెక్కించిన పోరాట సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు తెలిపారు. బాలయ్య, త్రిష కాంబినేషన్ తెరపై చాలా వైవిద్యంగా ఉంటుందని, అలాగే అలీ కామెడీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, నందమూరి అభిమానులను అద్యంతం ఆకట్టుకొనేలా సినిమా ఉండబోతోందని చిత్ర దర్శకుడు సత్యదేవ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట ప్రసాద్, కళ: రవీందర్, కార్యనిర్వాహక నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాత: రుద్రపాటి రమణారావు, రచన-దర్శకత్వం: సత్యదేవ.


Click it and Unblock the Notifications











