»   »  ఈ వయసులోనూ డూప్ లేకుండా అంత రిస్క్.... ఈ డెడికేషనే బాలయ్యని అక్కడ నిలబెట్టింది

ఈ వయసులోనూ డూప్ లేకుండా అంత రిస్క్.... ఈ డెడికేషనే బాలయ్యని అక్కడ నిలబెట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలకృష్ణ సినిమా అంటేనే యాక్షన్ ఎపిసోడ్స్ తప్పకుండా వుంటాయి. పక్కా మాస్ హీరో కాబట్టి ఫైట్స్ కంపల్సరీగా వుండాలి. అందుకే, ఈ ఏజ్ లో కూడా బాలయ్య యాక్షన్ ఎపిసోడ్స్ లో తనదైన బ్రాండుతో ఫైట్స్ చేస్తుంటాడు.సంక్రాంతికి 'గౌతమిపుత్ర శాతకర్ణి'గా నందమూరి బాలక్రిష్ణ అలరించనున్న సంగతి తెలిసిందే.

  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్రిష్ సహా చిత్ర యూనిట్ జార్జియాలో ఉంది. ఈ నెల 4 నుండి జార్జియాలోని రష్యాకు దగ్గరగా ఉండే ''మౌంట్ కజ్ బెగ్'' వద్ద యుద్ధ నేపథ్యంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.


  Balakrishna Doing Risky Stunts Without Dupe

  ఈ సీక్వన్స్‌‌లో హీరో కొన్ని రిస్కీ స్టంట్స్‌ చేయాల్సి రావటంతో ఆ సీన్స్‌ను డూప్‌తో చేయించాలని భావించారు చిత్రయూనిట్‌. అయితే అందుకు అంగీకరించని బాలయ్య తానే ఆ సీన్స్‌‌లో నటిస్తున్నాడు.నెలాఖరు వరకు జరుగనున్న ఈ షెడ్యూల్‌లో శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్యజరిగే పోరాట సన్నివేశాలను షూట్ చేయనున్నారు.


  సాధారణంగా ఇలాంటి సన్నివేశాలలో డూప్‌ల సాయం తీసుకుంటారు. అయితే బాలయ్య తానే స్వయంగా ఈ సన్నివేశాలలో నటిస్తున్నారట. యువ హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా బాలయ్య లాంటి సీనియర్ హీరో తన వయసుని, రిస్క్‌ని అని భావించక ఈ ఫీట్ చేస్తుండటం విశేషం. ఇదివరకు "లయన్" "డొక్టేటర్" సినిమాల టైం లోకూడా డూప్ లేకుండానే కొన్ని రిస్కీ ఫైట్స్ లో పాల్గొన్న బాలయ్య. లయన్ షూటింగ్ లో గాయపడటం మనకు తెలిసిందే.

  English summary
  All eyes are waiting to watch how Nandamuri Balakrishna is going to transform himself as Satavahana emperor Gautamiputra Satakarni and impress with his 100th film. Here comes an interesting update. he shooting risky shots that involves a lot of stunts. Even though director Krish suggested to have dupes Balakrishna objected the idea and said to do it by himself.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more