twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విమర్శలకు ధీటుగా బాలయ్య జవాబు.. కేటీఆర్ కలిసిన నటసింహం

    |

    కరోనావైరస్ క్లిష్ట పరిస్థితుల్లో స్పందించడం లేదని మీడియాలో వస్తున్న వార్తలకు నందమూరి బాలకృష్ణ ధీటుగా సమాధానం చెప్పారు. దేశంతోపాటు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించేందుకు తన వంతు సాయంగా బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్యేగా, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్‌గా ఈ విరాళాలను ప్రకటించడం విశేషం. విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి...

    కఠిన పరీక్షా సమయాల్లో

    కఠిన పరీక్షా సమయాల్లో

    కరోనా పెట్టిన కఠిన పరీక్ష సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నందమూరి బాలకృష్ణ అండగా నిలిచారు. తెలుగు రాష్ట్రాలకు మొతంగా రూ.1 కోటి 25 లక్షల రూపాయలను విరాళం ప్రకటించి తనపై వస్తున్న విమర్శలకు చెక్ చెప్పారు. కష్టాలు ఎదురైన సమయంలో తాను ఎప్పుడూ ప్రజల మనిషినేని స్పష్టం చేశారు.

    Recommended Video

    Nandamuri Balakrishna Requests Public To Stay At Home
    కేటీఆర్‌ను కలిసిన బాలయ్య

    కేటీఆర్‌ను కలిసిన బాలయ్య

    కరోనాపై పోరాటం చేయడానికి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచిన బాలకృష్ణ శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలుసుకొన్నారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌ కోసం రూ.25 లక్షల సహాయాన్ని ఆయనకు చెక్కు రూపంలో స్వయంగా అందించారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలోని వేతన కార్మికులకు అండగా ఉండగానికి ఇప్పటికే రూ.25 లక్షల చెక్‌ను నిర్మాత సీ కల్యాణ్‌కు అందజేయడం తెలిసిందే.

    ఏపీ ప్రభుత్వానికి రూ.50 లక్షలు

    ఏపీ ప్రభుత్వానికి రూ.50 లక్షలు

    ఇక ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా బాలకృష్ణ ఆర్థిక సహాయం అందించారు. ఏపీ ప్రభుత్వానికి రూ.50 లక్షల విరాళాన్ని అందించనున్నారు. త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్‌ను అందిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

    బాలయ్య చిన్నల్లుడు విరాళం

    బాలయ్య చిన్నల్లుడు విరాళం

    కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, గీతమ్ విద్యా సంస్థల చైర్మన్ ఎమ్ శ్రీ భరత్ 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయనిధికి రూ. 50 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు, కర్ణాటక ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు

    English summary
    Actor Balakrishna donates 1.25 crores to Telugu States. He announce Rs.50 lakhs to Telangana, Rs.50 lakhs to AP government and 25 lakhs to CCC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X